
హుబ్లీ: రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన సీడీ కేసు కొద్ది రోజులు స్తబ్దుగా ఉన్నా తాజాగా తన కుమార్తె కనిపించలేదని బాధితురాలి తండ్రి ధార్వాడ హైకోర్టు బెంచ్‌లో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. సీడీ కేసు వెలుగులోకి వచ్చాక తన కుమార్తె కొన్ని నెలలుగా కనిపించలేదని, ఆమె ఎక్కడ ఉందో తెలియదని, ఆమె ఆచూకీ తెలియజేయాలని కోర్టును అభ్యర్థించాడు. ఈ మేరకు యువతి తండ్రి ప్రకాశ్ వేసిన రిట్‌ను సోమవారం హైకోర్టు విచారణకు స్వీకరించింది.
చదవండి: రమేశ్‌ను అరెస్ట్ చేయాలి:కేపీసీసీ
చదవండి: సొంత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన మంత్రి
Comments
Please login to add a commentAdd a comment