Hubble
-
రాసలీల సీడీ కేసు: నా కూతురు ఆచూకీ చెప్పండి
హుబ్లీ: రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన సీడీ కేసు కొద్ది రోజులు స్తబ్దుగా ఉన్నా తాజాగా తన కుమార్తె కనిపించలేదని బాధితురాలి తండ్రి ధార్వాడ హైకోర్టు బెంచ్‌లో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. సీడీ కేసు వెలుగులోకి వచ్చాక తన కుమార్తె కొన్ని నెలలుగా కనిపించలేదని, ఆమె ఎక్కడ ఉందో తెలియదని, ఆమె ఆచూకీ తెలియజేయాలని కోర్టును అభ్యర్థించాడు. ఈ మేరకు యువతి తండ్రి ప్రకాశ్ వేసిన రిట్‌ను సోమవారం హైకోర్టు విచారణకు స్వీకరించింది. చదవండి: రమేశ్‌ను అరెస్ట్ చేయాలి:కేపీసీసీ చదవండి: సొంత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన మంత్రి -
‘బీటింగ్ హార్ట్’ను చిత్రించిన హబుల్
వాషింగ్టన్ : భూమికి 6523 కాంతి సంవత్సరాల దూరంలో ప్రజ్వరిల్లుతున్న నక్షత్రం ‘సూపర్నోవా క్రాబ్ నెబ్యులా’లోని కేంద్ర ప్రాంతం ‘బీటింగ్ హార్ట్’ను నాసాకు చెందిన హబుల్ టెలిస్కోప్ ఫొటో తీసింది. సూర్యుడితో సమానమైన భారం, అంతకుమించిన సాంద్రత కలిగిన న్యూట్రాన్ స్టార్ క్రాబ్ నెబ్యులా.. బీటింగ్ హార్ట్ ప్రదేశం నుంచి అత్యంత వేగంతో రేడియోధార్మిక, విద్యుదీకృత పదార్ధాలను బయటకు వెదజల్లుతోంది. సెకనుకు 30 స్వయంప్రదిక్షణలతో సంకోచ, వ్యాకోచాలు చెందుతూ.. కాంతి కిరణాలను, మెరుస్తున్న వాయువులను ఉద్గారిస్తూ.. హృదయ స్పందన తరహాలో కనిపించే ఈ బీటింగ్ హార్ట్ భాగాన్ని.. అత్యంత స్పష్టతతో తాజాగా హబుల్ చిత్రించింది. -
నక్షత్ర పేలుళ్లను గుర్తించిన హబుల్
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన హబుల్ టెలిస్కోపు మనకు దగ్గరలోనే ఉన్న ‘స్కైరాకెట్’ అనే గెలాక్సీలో నక్షత్ర పేలుళ్లను గుర్తించింది. క్రమంగా క్షీణించిపోతున్న ఈ గెలాక్సీ అసలు పేరు కిసో-5639. దీనికి ఒక చివర ఈ పేలుడు మొదలైంది. ఈ మరుగుజ్జు నక్షత్రమండలం చదరంగా ఉంది. ఈ గెలాక్సీ సాగదీసినట్లుండే గెలాక్సీలకు చక్కని ఉదాహరణ. అంతేకాకుండా మిగతా గెలాక్సీల కంటే ఇదే సమీపంలో ఉంది. ఇంత కల్లోలమైన పేలుళ్లకు కారణం గెలాక్సీల మధ్య ఉన్న వాయువులే అని ఖగోళ శాస్త్రవేత్తలంటున్నారు. విశ్వం ఆవిర్భావమైన సమయంలో ఈ వాయువుల వల్లే గెలాక్సీలు ఏర్పడి ఉంటాయని, మన పాలపుంత ఏర్పాటుకూ ఇదే కారణమని వారి అభిప్రాయం.