వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన హబుల్ టెలిస్కోపు మనకు దగ్గరలోనే ఉన్న ‘స్కైరాకెట్’ అనే గెలాక్సీలో నక్షత్ర పేలుళ్లను గుర్తించింది. క్రమంగా క్షీణించిపోతున్న ఈ గెలాక్సీ అసలు పేరు కిసో-5639. దీనికి ఒక చివర ఈ పేలుడు మొదలైంది. ఈ మరుగుజ్జు నక్షత్రమండలం చదరంగా ఉంది. ఈ గెలాక్సీ సాగదీసినట్లుండే గెలాక్సీలకు చక్కని ఉదాహరణ.
అంతేకాకుండా మిగతా గెలాక్సీల కంటే ఇదే సమీపంలో ఉంది. ఇంత కల్లోలమైన పేలుళ్లకు కారణం గెలాక్సీల మధ్య ఉన్న వాయువులే అని ఖగోళ శాస్త్రవేత్తలంటున్నారు. విశ్వం ఆవిర్భావమైన సమయంలో ఈ వాయువుల వల్లే గెలాక్సీలు ఏర్పడి ఉంటాయని, మన పాలపుంత ఏర్పాటుకూ ఇదే కారణమని వారి అభిప్రాయం.
నక్షత్ర పేలుళ్లను గుర్తించిన హబుల్
Published Fri, Jul 1 2016 7:17 PM | Last Updated on Mon, Sep 4 2017 3:54 AM
Advertisement
Advertisement