‘బీటింగ్ హార్ట్’ను చిత్రించిన హబుల్
వాషింగ్టన్ : భూమికి 6523 కాంతి సంవత్సరాల దూరంలో ప్రజ్వరిల్లుతున్న నక్షత్రం ‘సూపర్‌నోవా క్రాబ్ నెబ్యులా’లోని కేంద్ర ప్రాంతం ‘బీటింగ్ హార్ట్’ను నాసాకు చెందిన హబుల్ టెలిస్కోప్ ఫొటో తీసింది. సూర్యుడితో సమానమైన భారం, అంతకుమించిన సాంద్రత కలిగిన న్యూట్రాన్ స్టార్ క్రాబ్ నెబ్యులా.. బీటింగ్ హార్ట్ ప్రదేశం నుంచి అత్యంత వేగంతో రేడియోధార్మిక, విద్యుదీకృత పదార్ధాలను బయటకు వెదజల్లుతోంది.
సెకనుకు 30 స్వయంప్రదిక్షణలతో సంకోచ, వ్యాకోచాలు చెందుతూ.. కాంతి కిరణాలను, మెరుస్తున్న వాయువులను ఉద్గారిస్తూ.. హృదయ స్పందన తరహాలో కనిపించే ఈ బీటింగ్ హార్ట్ భాగాన్ని.. అత్యంత స్పష్టతతో తాజాగా హబుల్ చిత్రించింది.