Habeas Corpus
-
సెంథిల్ బాలాజీ విడుదలపై మద్రాస్ హైకోర్టు భిన్న తీర్పులు..
సాక్షి, చెన్నై: తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ విడుదలకు సంబంధించి మద్రాసు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్నమైన తీర్పులు ఇచ్చింది. మంత్రిని విడుదల చేయాలని జస్టిస్ నిషా భాను నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు చెప్పగా.. సెంథిల్‌ను విడుదల చేయకూడదని జస్టిస్ భరత చక్రవర్తి భిన్నంగా మరో తీర్పును వెలువరించారు. దీంతో ఈ కేసును మద్రాసు కోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్ విచారణ జరపనుంది. 'ఈడీకి అధికారం లేదు..' మనీ లాండరింగ్ కేసులో పోలీసు కస్టడీని కోరే అధికారం ఈడీకి ఉండదని జస్టిస్ నిషా భాను ధర్మాసనం తెలిపింది. కావున సెంథిల్ బాలాజీ భార్య మేఘాలా దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ చెల్లుబాటు అవుతుందని చెప్పారు. అంతేకాకుండా సెంథిల్ ఆస్పత్రిలో ఉన్న వ్యవధిని కస్టోడియల్ గడువు నుంచి మినహాయించాలని ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. భిన్నమైన తీర్పు.. జస్టిస్ నిషా భాను ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు పూర్తి విరుద్ధంగా జస్టిస్ భరత చక్రవర్తి తీర్పును వెలువరించారు. మేఘాలా దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ చెల్లుబాటు కాదని ధర్మాసనం తెలిపింది. కేవలం అరెస్టు, నిర్బంధం చట్టవిరుద్ధమని చూపితే తప్పా హెబియస్ కార్పస్ చెల్లుబాటు కాదని వెల్లడించారు. అంతేకాకుండా కస్టోడియల్ గడువును కూడా పెంచుతున్నట్లు తీర్పును వెలువరించారు. ఆరోగ్యం బాగా లేని కారణంగా ఒక్కరోజు కూడా ఈడీ విచారణలో సెంథిల్ గడపనందున జూన్ 14 నుంచి ఇప్పటివరకు కస్టోడియల్ గడువును మినహాయింపునిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. సెంథిల్ బాలాజీ అరెస్టులో ఈడీ చట్టపరమైన విధివిధానాలు పాటించలేదని మేఘాలా కోర్టుకు విన్నవించారు. సెషన్స్ కోర్టు ఇచ్చిన కస్టడీ గడువు తాత్కాలికమైనదని ధర్మాసనానికి తెలిపారు. దీనిపై స్పందించిన ఈడీ తరుపు న్యాయవాదులు.. అరెస్టుకు సంబంధించిన పంచనామాను సెంథిల్ బాలాజీ స్వీకరించలేదని తెలిపారు. సెషన్ కోర్టు రిమాండ్ ఇచ్చే క్రమంలోనే అరెస్టుకు సంబంధించిన కారణాలను సెంథిల్ బాలాజీకి వివరంగా తెలిపారని వెల్లడించారు. మంత్రి సెంథిల్ బాలాజీ అరెస్టు అక్రమమంటూ ఆయన భార్య మేఘలా జూన్ 14న హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేస్తూ కోర్టు మెట్లెక్కారు. అనారోగ్యం కారణంగా సెంథిల్ బాలాజీని కావేరీ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. అయితే.. ఈడీ దర్యాప్తు నిమిత్తం సెంథిల్ బాలాజీకి సెషన్స్ కోర్టు 8 రోజుల కస్టడీని విధించింది. ఇదీ చదవండి: పురుషులకు జాతీయ కమిషన్.. పిల్ కొట్టేసిన సుప్రీంకోర్టు -
సామ్రాజ్య భారతి: రెండవ బహదూర్ షా జఫర్ మరణం
ఢిల్లీ రాజు 2వ బహదూర్ షా జఫర్ బర్మాలోని రంగూన్లో బ్రిటిష్ వారి బందీగా మరణించారు. బహదూర్ షా మొఘల్ పరిపాలకులలో ఆఖరి వాడు. ఉర్దూ భాషా పారంగతుడు. ‘జఫర్’ ఇతని కలంపేరు. 1857 తిరుగుబాటులో బహదూర్ షా పాల్గొన్నారు. తిరుగుబాటుదారులు ఢిల్లీ చేరినప్పుడు తిరుగుబాటు సైన్యం సాధించిన భూభాగానికి రక్షకునిగా, చక్రవర్తిగా బహదూర్ షా జఫర్ని ఉంచారు. 1862లో తన 87వ సంవత్సరంలో ఆయన బలహీన పడ్డారు. బందీగా ఉండగా 1862లోనే ఆయన ఆరోగ్యస్థితి క్షీణదశకు చేరుకుంది. అదే ఏడాది నవంబరు 7 శుక్రవారం ఉదయం 5 గంటలకు ఈ చివరి మొఘల్ చక్రవర్తి జాఫర్ తుదిశ్వాస వదిలారు. చట్టాలు:హైకోర్ట్స్ యాక్ట్ కింద కలకత్తా హైకోర్టు ఏర్పాటైంది. బాంబేలోని జార్జి ఫోర్ట్ ధ్వంసం అయింది. నగర విస్తరణలో భాగంగా ప్రభుత్వమే దీనిని పడగొట్టింది. 1769లో ఆ జార్జి ఫోర్ట్ నిర్మాణం జరిగింది. ఇండియన్ స్టాక్ ట్రాన్స్ఫర్ యాక్ట్, హెబియస్ కార్పస్ యాక్ట్, ఫైన్ ఆర్ట్స్ కాపీరైట్ యాక్ట్ అమల్లోకి వచ్చాయి. జననాలు: విద్యావేత్తగా, సంఘ సంస్కర్తగా ప్రఖ్యాతి చెందిన రఘుపతి వెంకట రత్నం నాయుడు అక్టోబర్ 1న మచిలీపట్నంలో జన్మించారు. 1939 మే 26న మరణించారు. 19వ శతాబ్దపు తొలి మహిళా హక్కుల కార్యకర్త రమాబాయి రనడే జనవరి 25న బొంబాయిలో జన్మించారు. భారతదేశంలోని మహిళలకు స్వేచ్ఛ, హక్కులు లేని సమయం అది. వారిని సంకెళ్ల నుండి విముక్తి చేయడానికి రమాబాయి కృషి చేశారు. -
రాసలీల సీడీ కేసు: నా కూతురు ఆచూకీ చెప్పండి
హుబ్లీ: రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన సీడీ కేసు కొద్ది రోజులు స్తబ్దుగా ఉన్నా తాజాగా తన కుమార్తె కనిపించలేదని బాధితురాలి తండ్రి ధార్వాడ హైకోర్టు బెంచ్‌లో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. సీడీ కేసు వెలుగులోకి వచ్చాక తన కుమార్తె కొన్ని నెలలుగా కనిపించలేదని, ఆమె ఎక్కడ ఉందో తెలియదని, ఆమె ఆచూకీ తెలియజేయాలని కోర్టును అభ్యర్థించాడు. ఈ మేరకు యువతి తండ్రి ప్రకాశ్ వేసిన రిట్‌ను సోమవారం హైకోర్టు విచారణకు స్వీకరించింది. చదవండి: రమేశ్‌ను అరెస్ట్ చేయాలి:కేపీసీసీ చదవండి: సొంత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన మంత్రి -
ప్రేమ కోసం మతం మార్చుకున్నాడు.. కానీ
రాయ్‌పూర్ : ప్రేమించిన అమ్మాయి కోసం మతం మారాడు.. అనంతరం తల్లిదండ్రులకు చెప్పకుండా వివాహం చేసుకున్నారు. కానీ ఇప్పుడా యువతి తల్లిదండ్రులే కావాలని కోరుకుంటోంది. మేజర్ అయిన ఆ యువతి కోరికను కాదనలేమంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. దాంతో సదరు వ్యక్తి ‘నీ కోసం నేను మతం మార్చుకుంటే.. తల్లిదండ్రుల కోసం నువ్వు మనసు మార్చుకున్నావ్.. నన్ను ఒంటరిని చేశావం’టూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వివరాలు.. ఛత్తీస్‌గఢ్‌కి చెందిన అంజలి జైన్(23), మహ్మద్ ఇబ్రహీం సిద్ధిఖి (33)లు ప్రేమించుకున్నారు. వేరే మతస్తున్ని వివాహం చేసుకుంటే తన ఇంట్లో వాళ్లు ఒప్పుకోరని, అందువల్ల సిద్ధిఖిని మతం మారాల్సిందిగా అంజలి కోరింది. దాంతో ఈ ఏడాది ఫిబ్రవరి 23 న సిద్ధిఖి ముస్లిం మతం నుంచి హిందూ మతంలోకి మారాడు. మహ్మద్ సిద్ధిఖి కాస్తా ఆర్యన్ ఆర్యగా మారాడు. అనంతరం అంజలి, ఆర్యన్లు ఫిబ్రవరి 25న హిందూ సాంప్రదాయం ప్రకారం రాయ్‌పూర్ ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్నారు. అనంతరం అంజలి తమ వివాహం గురించి ఇంట్లో వారిని ఒప్పిస్తానని చెప్పడంతో ఎవరి ఇళ్లకు వారు వెళ్లారు. జూన్‌లో అంజలి తన వివాహం గురించి తల్లిదండ్రులకు చెప్పి, తన భర్త దగ్గరకు చేరుకుంది. దాంతో అంజలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, వారు అంజలిని ఆమె భర్త దగ్గర నుంచి తీసుకువచ్చి మహిళా పోలీసు కస్టడికి అప్పగించారు. దాంతో సిద్ధిఖి హైకోర్టును ఆశ్రయించాడు. లోకల్ పోలీసులు తన భార్యను తన నుంచి దూరం చేసి బలవంతంగా ఆమె తల్లిదండ్రులకు దగ్గరకు పంపించారని, ఆమెను తనకు చూపించాల్సిందిగా కోర్టును అభ్యర్ధిస్తూ ‘హెబియస్ కార్పస్’ పిటిష్‌న్ దాఖలు చేశాడు. విచారణ సమయంలో అంజలి మేనమామ.. సిద్ధిఖికి ఇంతకు ముందే వివాహం అయ్యిందని తెలిపాడు. ఇప్పుడు అంజలిని అతనితో పంపితే ప్రమాదం కాబట్టి ఆమెను తన తల్లిదండ్రులతో ఉండేలా ఆదేశించాల్సిందిగా కోర్టును కోరాడు. కానీ సిద్ధిఖి తనకు గతంలోనే వివాహం అయిన మాట వాస్తవమేనని, కానీ ఇప్పుడు విడాకులు తీసుకున్నానని.. ఈ విషయాలన్ని అంజలికి తెలుసని తెలిపాడు. కనుక ఆమెను తనతో పంపించాల్సిందిగా కోరాడు. ఇరు పక్షాల వాదనలు విన్న హై కోర్టు అంజలి తన తల్లిదండ్రులతో ఐనా ఉండవచ్చు లేదా గవర్నమెంట్ గర్ల్స్ హస్టల్‌లోనైనా ఉండవచ్చంటూ తీర్పునిచ్చింది. దాంతో సిద్ధిఖి సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. సిద్ధిఖి విచారణను పరిశీలించడానికి ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా అధ్యర్యంలో ఒక బెంచ్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫిర్యాదు విచారణ సమయంలో అంజలిని ప్రవేశపెట్టాల్సిందిగా దీపక్ మిశ్రా, దమ్తారి జిల్లా పోలీస్ సుపరిండెంట్‌ను ఆదేశించారు. విచారణకు హాజరైన అంజలి తాను తన తల్లిదండ్రులతో కలసి ఉండాలనుకుంటున్నట్లు, ఇందులో ఎవరి బలవంతం లేదని తెలిపింది. దాంతో సుప్రీం కోర్టు అంజలి మేజర్ అయినందున ఆమెకు తనకు ఇష్టం వచ్చిన వారితో ఉండే హక్కు ఉంది కనుక ఆమెను తన భర్తకు వద్దకు వెళ్లాలని ఆదేశించలేమంది. ఈ అనుకోని మలుపుకు షాక్‌కు గురైన సిద్ధిఖి ‘నేను తన కోసం మతం మార్చుకున్నాను. కానీ ఆమె తన తల్లిదండ్రుల కోసం మనసు మార్చుకుంది. తన తల్లిదండ్రుల బలవంత మేరకే ఆమె అలా మాట్లాడింద’ని సిద్ధిఖి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.