ఢిల్లీ రాజు 2వ బహదూర్ షా జఫర్ బర్మాలోని రంగూన్‌లో బ్రిటిష్ వారి బందీగా మరణించారు. బహదూర్ షా మొఘల్ పరిపాలకులలో ఆఖరి వాడు. ఉర్దూ భాషా పారంగతుడు. ‘జఫర్’ ఇతని కలంపేరు. 1857 తిరుగుబాటులో బహదూర్ షా పాల్గొన్నారు.
తిరుగుబాటుదారులు ఢిల్లీ చేరినప్పుడు తిరుగుబాటు సైన్యం సాధించిన భూభాగానికి రక్షకునిగా, చక్రవర్తిగా బహదూర్ షా జఫర్‌ని ఉంచారు. 1862లో తన 87వ సంవత్సరంలో ఆయన బలహీన పడ్డారు. బందీగా ఉండగా 1862లోనే ఆయన ఆరోగ్యస్థితి క్షీణదశకు చేరుకుంది. అదే ఏడాది నవంబరు 7 శుక్రవారం ఉదయం 5 గంటలకు ఈ చివరి మొఘల్ చక్రవర్తి జాఫర్ తుదిశ్వాస వదిలారు.
చట్టాలు:హైకోర్ట్స్ యాక్ట్ కింద కలకత్తా హైకోర్టు ఏర్పాటైంది.
బాంబేలోని జార్జి ఫోర్ట్ ధ్వంసం అయింది. నగర విస్తరణలో భాగంగా ప్రభుత్వమే దీనిని పడగొట్టింది. 1769లో ఆ జార్జి ఫోర్ట్ నిర్మాణం జరిగింది.
ఇండియన్ స్టాక్ ట్రాన్స్‌ఫర్ యాక్ట్, హెబియస్ కార్పస్ యాక్ట్, ఫైన్ ఆర్ట్స్ కాపీరైట్ యాక్ట్ అమల్లోకి వచ్చాయి.
జననాలు: విద్యావేత్తగా, సంఘ సంస్కర్తగా ప్రఖ్యాతి చెందిన రఘుపతి వెంకట రత్నం నాయుడు అక్టోబర్ 1న మచిలీపట్నంలో జన్మించారు. 1939 మే 26న మరణించారు.
19వ శతాబ్దపు తొలి మహిళా హక్కుల కార్యకర్త రమాబాయి రనడే జనవరి 25న బొంబాయిలో జన్మించారు. భారతదేశంలోని మహిళలకు స్వేచ్ఛ, హక్కులు లేని సమయం అది. వారిని సంకెళ్ల నుండి విముక్తి చేయడానికి రమాబాయి కృషి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment