
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో రాసలీలల సీడీ కేసు మలుపులు తిరుగుతోంది. తాజా మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళిపై ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త దినేశ్ కల్లహళ్లి ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం దినేశ్ తరపున ఆయన న్యాయవాది దినేశ్ పాటిల్ కబ్బన్ పార్కు పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదును ఉపసంహరించుకుంటున్నట్లు లేఖ ఇచ్చారు. సీడీల్లో ఉన్న యువతి జాడ తెలియరాలేదు. మరికొందరు మంత్రులపై దినేశ్ కుట్రలు చేస్తున్నాడని, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నాడని కొందరు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో దినేశ్ యూ టర్న్ చర్చనీయాంశమైంది. ఫిర్యాదు చేసిన తర్వాత జరిగిన ఘటనలతో విసిగిపోయి ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్లు దినేశ్ తెలిపారు. తాను డీల్ కుదుర్చుకుని బ్లాక్‌మెయిల్ చేస్తున్నానని మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి ఆరోపించడంతో అసహనానికి గురయినట్లు చెప్పారు.
చదవండి: (రాసలీలల వీడియో : ఆ యువతి ఎక్కడ?)
Comments
Please login to add a commentAdd a comment