Case withdrawal
-
కర్ణాటక రాసలీలల సీడీ కేసులో కీలక మలుపు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో రాసలీలల సీడీ కేసు మలుపులు తిరుగుతోంది. తాజా మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళిపై ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త దినేశ్ కల్లహళ్లి ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం దినేశ్ తరపున ఆయన న్యాయవాది దినేశ్ పాటిల్ కబ్బన్ పార్కు పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదును ఉపసంహరించుకుంటున్నట్లు లేఖ ఇచ్చారు. సీడీల్లో ఉన్న యువతి జాడ తెలియరాలేదు. మరికొందరు మంత్రులపై దినేశ్ కుట్రలు చేస్తున్నాడని, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నాడని కొందరు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో దినేశ్ యూ టర్న్ చర్చనీయాంశమైంది. ఫిర్యాదు చేసిన తర్వాత జరిగిన ఘటనలతో విసిగిపోయి ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్లు దినేశ్ తెలిపారు. తాను డీల్ కుదుర్చుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నానని మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి ఆరోపించడంతో అసహనానికి గురయినట్లు చెప్పారు. చదవండి: (రాసలీలల వీడియో : ఆ యువతి ఎక్కడ?) (మంత్రి రాసలీలల వీడియోలు వైరల్) (వీడియో సీడీలంటేనే వణికిపోతున్న మంత్రులు) -
సీఎం ఆదేశం: వారిపై కేసులు ఎత్తివేత
సాక్షి, నెల్లూరు: ధాన్యం మద్దతు ధర కోసం ఆందోళన చేసిన రైతులపై పోలీసులు కేసులు ఎత్తివేశారు. కేసుల విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి తీసుకెళ్లగా, తక్షణమే స్పందించిన ముఖ్యమంత్రి.. కేసులు ఉపసంహరించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం వైఎస్ జగన్ నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు... ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ అన్ని వర్గాల సంక్షేమం కోసం పని చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు హయాంలో రైతులపై పెట్టిన కేసులను కూడా వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత ఎత్తివేశారని పేర్కొన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా రైతులపై పెట్టిన కేసుల విషయంలో ఈ విధంగా స్పందించలేదన్నారు. సీఎం చర్యలతో విపక్షాలకు వాయిస్ లేకుండా పోయిందన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఉన్న అడ్డంకులు తొలగించడంతో పాటు రైతులపై కేసులు ఎత్తివేసిన సీఎం జగన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రైతుల విషయంలో సంయమనం పాటించాలని, సమస్య జఠిలం చేయడం సరైనది కాదని ఎమ్మెల్యే గోవర్ధన్‌రెడ్డి పోలీసులకు సూచించారు. -
ఆ కేసులను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: పాత గుంటూరు పోలీసుస్టేషన్‌పై దాడి కేసులను ఉపసంహరిస్తూ హోంశాఖ ఆదేశాలు జారీచేసింది. ఈ ఘటనలో యువతపై నమోదైన కేసులను వెనక్కు తీసుకుంటూ హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు ఇచ్చారు. ఉత్తర్వుల్లో నిందితులైన వారిపై కేసులు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కాగా.. 2018లో పాత గుంటూరు పోలీస్ స్టేషన్‌పై జరిగిన దాడికి సంబంధించిన అధికారులు అప్పట్లో ఆరు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. (అర్ధరాత్రి ఉద్రిక్తత.. పాత గుంటూరులో 144 సెక్షన్) -
‘ముందు నష్ట పరిహారం.. తర్వాతే కేసు విత్‌డ్రా’
న్యూఢిల్లీ: కేరళకు చెందిన మత్స్యకారులను కాల్చి చంపిన 2012 నాటి ‘ఇటాలియన్ మెరైన్’ కేసులో సుప్రీం కోర్టు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది. నాటి ఘటనకు సంబంధించిన బాధితులకు.. ఇటలీ నష్ట పరిహారం చెల్లిస్తేనే ఈ కేసు ముగుస్తుందని కోర్టు స్పష్టం చేసింది. ‘ఇటలీ వారికి పరిహారం చెల్లించనివ్వండి. అప్పుడే ప్రాసిక్యూషన్‌ని ఉపసంహరించుకుంటాము’ అని ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఏ బాబ్డే స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఐక్యరాజ్యసమితి ట్రిబ్యూనల్ నిర్ణయం మేరకు కేసును ఉపసంహరించుకోవాల్సిందిగా కేంద్రం, సుప్రీం కోర్టును కోరింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు హాజరయ్యి వాదనలు వినిపించారు. (అసభ్యతను వ్యాప్తి చేస్తున్నారు: సుప్రీంకోర్టు) నాటి ఘటనకు బాధ్యులైన అధికారలను విచారిస్తామని.. బాధిత కుటుంబాలకు గరిష్ట నష్ట పరిహారం అందజేస్తామని ఇటలీ ఒక లేఖలో హామీ ఇచ్చినట్లు తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. అయితే కేంద్రం వాదనలను కోర్టు తోసిపుచ్చింది. మత్స్యకారుల కుటుంబాలకు ముందుగా నష్టపరిహారం చెల్లించాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. బాధితుల బందువులతో పాటు వారికి అందజేసే చెక్కులను తీసుకుని కోర్టుకు హాజరు కావాలని తెలిపింది. అంతేకాక వారం రోజుల్లో బాధితుల కుటుంబాలను ఈ కేసులో చేర్చుతూ దరఖాస్తు చేయాలని కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. కేసును ఉపసంహరించుకునే ముందు బాధిత కుటుంబాల వాదనలను వినాల్సిన అవసరం ఉదని కోర్టు స్పష్టం చేసింది. (గతేడాది ఆత్మహత్య.. రూ.100 కోట్లు ఇప్పించండి) ఈ కేసును విచారించిన అంతర్జాతీయ ట్రిబ్యునల్ భారత్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇటలీ మిలిటరీ చర్యలు భారత పౌరుల హక్కుకు భంగం కలిగించి, నిబంధనలు ఉల్లంఘించాయన్న ట్రిబ్యునల్.. ఈ కేసులో భారత్ వాదనను సమర్థించింది. ఈ నేపథ్యంలో ప్రాణ నష్టానికి బదులుగా పరిహారం పొందేందుకు భారత్ అర్హత సాధించిందని తెలిపింది. బాధిత కుటుంబాలకు ఇటలీ నష్ట పరిహారం చెల్లించాలని సూచించింది. -
ఈసారి.. జైట్లీకి సారీ!
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై దాఖలుచేసిన సివిల్, క్రిమినల్ పరువునష్టం కేసులను ఉపసంహరించుకునేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అంగీకరించారు. ఈ కేసుల్ని సెటిల్ చేసుకుంటామని జైట్లీ, కేజ్రీవాల్ సోమవారం ఢిల్లీ హైకోర్టుతో పాటు మరో ట్రయల్ కోర్టు ముందు ఉమ్మడి పిటిషన్లు దాఖలుచేశారు. 2000–13 మధ్యలో ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) చైర్మన్‌గా ఉన్న జైట్లీ, ఆయన కుటుంబ సభ్యులతో కలసి ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించడంతో కేజ్రీవాల్‌పై క్రిమినల్ పరువునష్టం కేసు దాఖలైంది. ఈ ఆరోపణలపై ఇటీవల కేజ్రీవాల్ క్షమాపణలు కోరుతూ లేఖ రాయడంతో కేసును వెనక్కు తీసుకునేందుకు జైట్లీ అంగీకరించారు. అలాగే ఆప్ నేతలు సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, దీపక్ బాజ్‌పాయ్, అశుతోష్‌లు కూడా క్షమాపణలు చెప్పడంతో వారిపై కేసుల ఉపసంహరణకూ జైట్లీ అంగీకరించారు. కేజ్రీవాల్, జైట్లీల పిటిషన్లను మంగళవారం కోర్టు విచారిస్తుందని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ తెలిపారు. జైట్లీపై ఆరోపణలు చేసిన మరో ఆప్ నేత కుమార్ విశ్వాస్ ఎలాంటి క్షమాపణలు చెప్పకపోవడంతో ఆయనపై విచారణ కొనసాగనుంది. -
కేసుల ఉపసంహరణపై కౌంటర్ వేయండి
-
కేసుల ఉపసంహరణపై కౌంటర్ వేయండి
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మంత్రులు, అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, పలు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేసేంత వరకూ కింది కోర్టుల్లో కేసుల ఉపసంహరణ పిటిషన్లు విచారణకు వస్తే వాయిదా తీసుకుంటామంటూ అడ్వొకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ ఇచ్చిన హామీని హైకోర్టు నమోదు చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 19కి వాయిదా వేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిల ధర్మాసనం ఈ ఉత్తర్వులిచ్చింది. టెండర్లు పిలవకుండా ప్రసార హక్కులా? ఎటువంటి టెండర్లను ఆహ్వానించకుండానే ఆంధప్రదేశ్ శాసనసభ, శాసనమండలి సమావేశాల ప్రత్యక్ష ప్రసారాల హక్కులను ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి చెందిన అడ్వాన్డŠస్ కమ్యూనికేషన్స్‌కు కట్టబెట్టడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. టెండర్లు ఆహ్వానించకుండా కేవలం నామినేషన్ పద్ధతిపైనే ప్రత్యక్ష ప్రసారాల హక్కులను అడ్వాన్డŠస్ కమ్యూనికేషన్స్‌కు అప్పగించడంపై వివరణ ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. ఇందులో భాగంగా న్యాయ, అసెంబ్లీ వ్యవహారాల ముఖ్య కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శి, అడ్వాన్డ్స్ కమ్యూనికేషన్స్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 12కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.