
సాక్షి, నెల్లూరు: ధాన్యం మద్దతు ధర కోసం ఆందోళన చేసిన రైతులపై పోలీసులు కేసులు ఎత్తివేశారు. కేసుల విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి తీసుకెళ్లగా, తక్షణమే స్పందించిన ముఖ్యమంత్రి.. కేసులు ఉపసంహరించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం వైఎస్ జగన్ నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు.
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు...
ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ అన్ని వర్గాల సంక్షేమం కోసం పని చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు హయాంలో రైతులపై పెట్టిన కేసులను కూడా వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత ఎత్తివేశారని పేర్కొన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా రైతులపై పెట్టిన కేసుల విషయంలో ఈ విధంగా స్పందించలేదన్నారు. సీఎం చర్యలతో విపక్షాలకు వాయిస్ లేకుండా పోయిందన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఉన్న అడ్డంకులు తొలగించడంతో పాటు రైతులపై కేసులు ఎత్తివేసిన సీఎం జగన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రైతుల విషయంలో సంయమనం పాటించాలని, సమస్య జఠిలం చేయడం సరైనది కాదని ఎమ్మెల్యే గోవర్ధన్‌రెడ్డి పోలీసులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment