సాక్షి, బెంగళూరు: మాజీమంత్రి రమేశ్ జార్కిహొళి అశ్లీల బాగోతం కేసులో యువతి ప్రియుడు ఆకాష్ సోమవారం సిట్ ముందు హాజరయ్యాడు. యువతి ప్రేమ మైకంలో మునిగిపోయానని, అరచేతిలో స్వర్గం చూపించి మోసం చేసిందని అతడు చెప్పినట్లు తెలిసింది. సీడీ రికార్డింగ్ గురించి ఆమెకు తెలుసు. ఆ విషయం నాకు చెప్పలేదు అని అన్నాడు. సీడీ చూపించి డబ్బు గుంజడానికి పథకం వేశారని తరువాత తెలిసిందన్నారు.
సీసీ కెమెరాల్లో సాక్ష్యాలు..
సీడీ కేసు విచారిస్తున్న సిట్ పోలీసులు ఆమెకు ఆకాష్ అనే ప్రియుడు ఉన్నాడని గుర్తించి విచారణకు పిలిచారు. ఇక యువతి, ఆమె బృందం కదలికల ఆధారాల కోసం 70 సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు. అతని ద్వారా ఆమె ఎక్కడెక్కడ సంచరించిందీ తెలుసుకున్నారు. ఆ ప్రాంతాల్లో సీసీ కెమెరాల చిత్రాలను స్వాధీనం చేసుకున్నారు. తద్వారా కీలక సాక్ష్యాలు లభించినట్లు తెలిసింది. సీడీ విడుదల కాకముందు ఆకాష్ కొందరు పాత్రికేయులను కలిసిన దృశ్యాలు లభించాయి.
లాక్‌డౌన్ అవసరం : కుమార
బనశంకరి: కర్ణాటకలో రోజురోజుకు కరోనా కేసులు హెచ్చుమీరుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్ చేయడం మంచిదని మాజీ సీఎం హెచ్‌డీ.కుమారస్వామి అభిప్రాయపడ్డారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రంలో కరోనా గ్రాఫ్ పెరిగిందని ప్రస్తుతం వెయ్యికి చేరువలో కరోనా కేసులు నమోదవుతున్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment