బెంగళూరు: కర్ణాటక జలవనరుల శాఖ మంత్రి రమేశ్ జర్కిహోలికి, యువతికి మధ్య జరిగిన రాసలీలల వీడియో కర్ణాటకలో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రమేశ్ జర్కిహోలి ఈ ఘటనకు నైతక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. తాజాగా మంత్రికి, యువతికి మధ్య జరిగిన మెసేజ్‌లు కొన్ని లీక్ అయ్యాయి. దీనిలో రమేశ్ జర్కిహోలి కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పను ఉద్దేశిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. యడ్డీ భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డాడంటూ యువతికి చేసిన మెసేజ్‌లో తెలిపారు జర్కిహోలి. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది..
యువతి: బెల్గాంలో కన్నడ, మరాఠీ ప్రజలు బాగా కొట్టుకుంటున్నారు కదా?
మంత్రి: మరాఠీలు చాలా మంచి వారు. బెల్గాం కన్నడిగులకు ఏం పని లేదు.
మంత్రి: సిద్దరామయ్య చాలా మంచి వాడు. యడియూరప్ప భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డాడు.
యువతి: మీరు ఢిల్లీకి వెళ్తున్నారు.. సీఎం అవుతారా?
మంత్రి: ప్రహ్లాద్ జోషి ముఖ్యమంత్రి అవుతారు... అంటూ సాగిన సంభాషణకు సంబంధించిన మెసేజ్‌లు ప్రస్తుతం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. యడ్డీ కేబినెట్‌లోని మినిస్టరే ఆయన పెద్ద అవినీతిపరుడని పేర్కోవడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది.
ఈ క్రమంలో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ డేకే శివకుమార్ ఈ మెసేజ్‌లపై స్పందిస్తూ.. ‘‘ఇది కేవలం సెక్స్ స్కాండల్ వీడియో మాత్రమే కాదు.. దీనిలో జర్కిహోలి.. ముఖ్యమంత్రి అవినీతి గురించి మాట్లాడారు. దీనికి యడ్డీ సమాధానం చెప్పాలి. వీటిని అబద్దం అని నిరూపించాలి. ఇప్పుడు బాల్ వారి కోర్టులో ఉంది. ప్రస్తుతం బీజేపీ ఈ అంశంలో ఎంతో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాం’’ అన్నారు.
పౌరహక్కుల పోరాట సమితి అధ్యక్షుడు దినేశ్ కల్లహళ్లి మంత్రి రాసలీలలకు సంబంధించిన వీడియోలను బెంగళూరు నగర పోలీసు కమిషనర్ కమల్ పంత్‌కు అందజేసి.. జర్కిహోయడంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో కర్ణాటక హోం మినిస్టర్ బసవరాజ్ బొమ్మై జర్కిహోలిపై వచ్చిన ఆరోపణల అంశంలో ఇప్పటికే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని తెలిపారు.
చదవండి:
సీఎం బంధువునని మేయర్ కాకుండా కుట్ర
రాసలీలల వీడియో: మంత్రి రాజీనామా
Comments
Please login to add a commentAdd a comment