బనశంకరి/కర్ణాటక: మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళి అశ్లీల సీడీ కేసులో అనుమానితుడు నరేశ్ భార్యను సిట్ బుధవారం అదుపులోకి తీసుకుంది. శిరా పోలీస్‌స్టేషన్ సీఐ అంజుమాల నేతృత్వంలో ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. కాగా, దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన సీడీ కేసులో మాజీ విలేకరి నరేశ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న అతడు, ఇటీవల ఓ వీడియో విడుదల చేసి, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు.
అదే విధంగా, సీడీలో ఉన్న యువతి తన వద్దకు వచ్చి న్యాయం చేయాలని కోరిందని, అంతేతప్ప ఈ వ్యవహారం గురించి తనకేమీ తెలియదని పేర్కొన్నాడు. అయితే, సిట్ సోదాల్లో భాగంగా నరేశ్ ఇంట్లో లక్షలాది రూపాయలు విలువ చేసే బంగారు నగలు కొన్నట్లు రసీదులు దొరికడంతో మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. కాగా మార్చి 2న విడుదలైన రాసలీలల సీడీలో కనిపించిన యువతి కోసం సిట్ పోలీసులు ఎంతగా గాలిస్తున్నా ఆమె ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదు. ఈ నేపథ్యంలో సీడీ కేసు విషయమై అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.
చదవండి: రాసలీలల కేసు: యువతి చిన్నప్పటి విషయాలపై ఆరా
సీడీ ముఠా ఎక్కడ.. వారికి డబ్బులెలా వస్తున్నాయి?!
Comments
Please login to add a commentAdd a comment