రమేష్ జార్కిహొళి (ఫైల్ ఫోటో)
సాక్షి బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జార్కిహొళి రాసలీలల సీడీ కేసులో ప్రధాన సూత్రధారులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులతో పాటు బాధిత యువతి ఢిల్లీలో ఉండొచ్చనే అనుమానంతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పోలీసులు దేశ రాజధాని చుట్టుపక్కల గాలింపు చేపట్టారు. రాసలీల సీడీతో తనకు ఏ మాత్రం సంబంధం లేదంటూ ఈ కేసులో కీలకంగా మారిన ప్రధాన సూత్రధారి నరేశ్‌గౌడ గురువారం విడుదల చేసిన వీడియోను ఢిల్లీ నుంచే అప్‌లోడ్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు.
వీడియో విడుదల చేసిన అనంతరం నరేశ్‌గౌడతో పాటు మిగిలిన వారు ఢిల్లీలో తాము ఉంటున్న స్థలాన్ని వీడి మరో ప్రాంతానికి వెళ్లినట్లుగా కూడా సిట్‌కు సమాచారం అందినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురి ఆచూకీ కోసం ఢిల్లీని సిట్ అధికారులు జల్లెడ పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment