
సాక్షి, బళ్లారి: రాసలీల సీడీలో ఉన్న యువతి నాలుగు నెలలుగా కుటుంబానికి దూరమైంది. ఆమెను తమకు చూపాలని కుటుంబ సభ్యులు సిట్‌కు విన్నవించారు. సదరు యువతి అవ్వ విజయపుర జిల్లా నిడగుందిలో ఉంటోంది. ఆమెకు అనారోగ్యంగా ఉండటంతో ఆ యువతి తల్లిదండ్రులు ఈనెల 1న నిడగుందికి వచ్చారు. అప్పటినుంచి వారు అక్కడే ఉంటున్నారు. ఈక్రమంలో సిట్ అధికారులను కలిసి తమ కుమార్తెను తమకు చూపించాలని కోరుతున్నారు.
సీడీ యువతికి డబ్బు పంపలేదు: మాజీ మంత్రి
సాక్షి, బళ్లారి: రాసలీల సీడీలో ఉన్న యువతికి తాను నగదు ట్రాన్స్‌ఫర్ చేయలేదని మాజీ మంత్రి డి.సుధాకర్ అన్నారు. ఆదివారం ఆయన చిత్రదుర్గంలో విలేకరులతో మాట్లాడారు. ఇద్దరు మాజీ మంత్రులు సీడీ యువతికి నగదు పంపినట్లు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. నగదు పంపి ఉంటే ఇప్పటికే కోర్టు నుంచి రక్షణ ఉత్తర్వులు తెచ్చుకొనేవారమన్నారు. ఎస్‌ఐటీ అధికారులు తనను విచారణకు పిలిస్తే హాజరై సమాధానం చెబుతానన్నారు. తనకు మాజీ సీఎం సిద్దరామయ్య, రమేష్ జార్కిహొళి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే.శివకుమార్‌లతో మంచి సంబంధాలున్నాయన్నారు. ఎవరితోనూ రాజకీయ విభేదాలు లేవన్నారు.
చదవండి: బెంగళూరు డ్రగ్ కేసులో నలుగురు తెలంగాణ ఎమ్మెల్యేలు?
Comments
Please login to add a commentAdd a comment