
సాక్షి, బళ్లారి: రాష్ట్ర మాజీ మంత్రి రమేష్ జార్కిహోళి రాసలీలల సీడీ కేసులోని యువతి తల్లి అనారోగ్యానికి గురయ్యారు. ఉన్నఫళంగా ఆరోగ్యం సరిగా లేకపోవడంతో సోమవారం పోలీసు భద్రతతో విజయపురలోని ప్రముఖ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. కాగా, తన తల్లి(సీడీ యువతి అమ్మమ్మ)కి ఆరోగ్యం సరిగా లేనందున, ఆమె బెళగావి నుంచి విజయపురకు వచ్చారు. అదే సమయంలో అస్వస్థతకు గురయ్యారు. ఇక కూతురును చూసేందుకు అనుమతి ఇవ్వాలని సీడీ యువతి తల్లి సిట్‌ని కోరిన సంగతి తెలిసిందే.