
డీకే శివకుమార్‌తో నరేష్‌గౌడ
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో ట్రబుల్ షూటర్‌గా పేరుగాంచిన కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌పై రాసలీలల బాగోతంలో ఆరోపణలు వస్తున్నాయి. మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళి వీడియో కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నరేశ్‌గౌడ, డీకే శివకుమార్‌తో ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వ్యాప్తి అయ్యింది. ఆ ఫోటోను కర్ణాటక బీజేపీ తన ట్విట్టర్‌లో పోస్టు చేసి ఒకే ఫ్రేమ్‌లో మాస్టర్ మైండ్– రింగ్ మాస్టర్ ఉండటం ఏమిటి అని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. దీనిపై నెటిజన్లు తలోరకంగా కామెంట్లు చేశారు. కాగా, నరేశ్‌గౌడ సిట్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment