వీడియో దృశ్యం
బెంగళూరు : చనిపోయిన వ్యక్తిని శ్మశానానికి తరలించేందుకు స్థానికులు సహకరించకపోవటంతో మృతుడి కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. సైకిల్‌పైనే శవాన్ని కాటికి చేర్చింది. ఈ హృదయ విదారకర ఘటన కర్ణాటకలోని బెలగావి జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. బెలగావి జిల్లా కిత్తూరు తాలూకా ఎమ్‌కే హుబ్బలికి చెందిన ఓ వ్యక్తి కొద్దిరోజుల క్రితం చనిపోయాడు. ( గంటన్నర టెన్షన్ )
అతడు కరోనా వల్లే చనిపోయాడని భావించిన స్థానికులు అంత్యక్రియలకు దూరంగా ఉండిపోయారు. దీంతో మృతుడి కుటుంబం సైకిల్‌పైనే శవాన్ని శ్మశానానికి చేర్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ ఈ సోమవారం తన ట్విటర్ ఖాతాలో షేర్ చేయటంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ( ఏం చేస్తున్నావు? నేను చూసేశాను!)
ಬೆಳಗಾವಿಯ ಕಿತ್ತೂರಿನ 70 ವರ್ಷದ ವೃದ್ಧನ ಶವವನ್ನು ಕುಟುಂಬ ಸದಸ್ಯರು ಮಳೆಯಲ್ಲಿ ನೆನೆಯುತ್ತಾ ಸೈಕಲ್ ನಲ್ಲಿ ಸಾಗಿಸಿದ್ದಾರೆ
— DK Shivakumar (@DKShivakumar) August 17, 2020
ಸಿಎಂ @BSYBJP ಅವರೇ ಎಲ್ಲಿದೆ ನಿಮ್ಮ ಸರ್ಕಾರ? ಅವರಿಗೆ ಏಕೆ ಆಂಬ್ಯುಲೆನ್ಸ್ ಒದಗಿಸಲಿಲ್ಲ?
ಈ ಅಸಮರ್ಥ ಸರ್ಕಾರಕ್ಕೆ ಮಾನವೀಯತೆ ಇಲ್ಲವಾಗಿದ್ದು, ಪಿಡುಗು ಪರಿಸ್ಥಿತಿಯನ್ನು ನಿಭಾಯಿಸಲು ಸಂಪೂರ್ಣವಾಗಿ ವಿಫಲವಾಗಿದೆ pic.twitter.com/dZxCj9sO9P
Comments
Please login to add a commentAdd a comment