తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం కర్ణాటక సీఎం కుమారస‍్వామితో ఫోన్‌లో మాట్లాడారు. జూరాలకు నీటి విడుదలపై ఆయన ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రితో చర్చించారు. జూరాల ప్రాజెక్టుకు మూడు టీఎంసీల నీటిని విడుదల చేయాలని కేసీఆర్ కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కుమారస్వామి ప్రభుత్వం ...ఒకటి, రెండు రోజుల్లో నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.