palamuru water
-
బీఆర్ఎస్ అవినీతిని ఎండగట్టాం.. : మంత్రి పొంగులేటి
మహబూబ్‌నగర్: ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ చేసిన అవినీతిని శ్వేతపత్రంలో ఎండగట్టామని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పాలమూరు న్యాయయాత్రలో భాగంగా వనపర్తి జిల్లా కొత్తకోటలో గురువారం కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న కేసీఆర్ కృష్ణా పరివాహక ప్రాంతం నుంచి పాలమూరు జిల్లాలో ఏ ఒక్క ఎకరాకై నా నీళ్లు ఇచ్చారా.. అని ప్రశ్నించారు. పాలమూరు జిల్లాను పట్టించుకున్న ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ హయాంలో పాలమూరులో చేపట్టిన ప్రాజెక్టులు దాదాపు 90 శాతం పూర్తయ్యాయని, బీఆర్ఎస్ వచ్చిన తర్వాత కాల్వల్లో కంప, జమ్ము తొలగించి నీళ్లు పారించి పూలు జల్లి తామే అంతా చేశామని గొప్పలు చెప్పుకొన్నారని విమర్శించారు. మాయమాటలు చెప్పి రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ పాలమూరుకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. కార్యక్రమానికి వచ్చే ముందు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి ఏం మాట్లాడాలి అని అడిగితే.. దేవరకద్ర నియోజవర్గంలో 100 పడకల ఆస్పత్రి, మండలానికో 30 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేద్దామని చెప్పారన్నారు. ధరణి పేరుతో రైతుల భూములు లాక్కున్న వారి నుంచి తిరిగి తీసుకుని ప్రజలకు ఇస్తామన్నారు. పాలమూరును కాపాడేందుకే న్యాయయాత్ర.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి చల్లా వంశీచందర్‌రెడ్డి మాట్లాడుతూ దేశాన్ని కాపాడేందుకు రాహుల్‌గాంధీ చేపడుతున్న ‘భారత్ జోడో యాత్ర’ను ఆదర్శంగా తీసుకుని ‘పాలమూరు న్యాయ యాత్ర’ చేపట్టానన్నారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ తమపై నమ్మకంతో ప్రజలు ఓటు వేసి గెలిపించారని, రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి న్యాయం జరిగేలా కృషిచేస్తామన్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటంబానికి సంక్షేమ పథకాలను అందిస్తామన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త, నాయకుడు పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజలను మభ్యపెట్టారు! రాజాపూర్: తెలంగాణ ఏర్పాటు తర్వాత అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు రాష్ట్ర ప్రజలను మాయమాటలతో మభ్యపెట్టారు.. ఇప్పుడు అధికారం కోల్పోయి రెండు నెలలు కూడా పూర్తికాని కాంగ్రెస్ ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడలోని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి నివాసంలో ఆయన మాట్లాడుతూ పదేళ్ల పాటు అధికారంలో ఉండి కాలయాపన చేసింది మీరు కాదా అని విమర్శించారు. కృష్ణానది నీటిని ఎట్టి పరిస్థితుల్లో కేంద్రానికి అప్పజెప్పే ప్రసక్తే లేదన్నారు. ఇంకా వారే అధికారంలో ఉన్నట్లు భ్రమపడుతూ కాంగ్రెస్ పార్టీపై, ప్రభుత్వంపై నెట్టాలని చూడటం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక విజన్‌తో ముందుకు వెళ్తున్నారన్నారు. సమావేశంలో రంగారెడ్డిగూడ మాజీ సర్పంచ్‌లు జనంపల్లి శశికళారెడ్డి, దుష్యంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: కేసీఆర్ హామీతో.. ఆ స్థానం పదిలమేనా!? -
పాలమూరు ఎత్తిపోతలపై ప్రభుత్వ నిర్లక్ష్యం
అనంతగిరి: రాష్ట్ర ప్రభుత్వానికి కాళేశ్వరంపై ఉన్న శ్రద్ధ ‘పాలమూరు ఎత్తిపోతల’పై లేదని.. వికారాబాద్ జిల్లా నానాటికి నిర్లక్ష్యానికి గురవుతోందని టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. అనంతగిరిగుట్ట హరిత రిసార్ట్స్‌లో ఆదివారం రాష్ట్ర డెవలప్మెంట్ ఫోరం ఆ«ధ్వర్యంలో నదీ జలాల సంరక్షణపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల్ని స్వాధీనం చేసుకుంటూ కేంద్ర జలవనరుల శాఖ గెజిట్ విడుదల చేయడం సరికాదన్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన విమర్శించారు. జూరాల ప్రాజెక్టుతో లిఫ్ట్ చేసుకుంటే ఈ ప్రాంతానికి నీళ్లొస్తాయన్నారు. కాళేశ్వరం నిర్మించిన ఈ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి, జూరాల ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. అనంతగిరి నుంచి ఏ ఉద్యమం చేపట్టినా ఉవ్వెత్తున ఎగిసిన దాఖలాలున్నాయని ఆయన గుర్తు చేశారు. దీనిపై గ్రామగ్రామాన కరపత్రాలు వేయించి అవగాహన కల్పిద్దామన్నారు. అనంతరం వక్తలందరూ కేంద్ర గెజిట్‌ను ఉపసంహరించుకోవాలని కోరారు. సమావేశంలో సీనియర్ పాత్రికేయుడు రామచంద్రమూర్తి, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం చైర్మన్ రణధీర్ బద్దం, అధ్యక్షుడు రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్, పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ మాజీ ఓఎస్డీ రంగారెడ్డి పాల్గొన్నారు. -
NGT: తాగునీటి కోసమే రిజర్వాయర్లు
సాక్షి, న్యూఢిల్లీ: తాగునీటిని అందించడానికే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణాన్ని చేపట్టామని తెలంగాణ స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) చెన్నై ధర్మాసనం ముందు వాదనలు వినిపించింది. అయితే, కేంద్రం వైఖరి చెప్పకుండా ఆదేశాలు ఇవ్వొద్దని ఏపీ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ విజ్ఞప్తి చేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు లేవంటూ ఏపీ రైతుల డి.చంద్రమౌళీశ్వరరెడ్డి తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం జస్టిస్ రామకృష్ణన్, విషయ నిపుణుడు సత్యగోపాల్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఎన్జీటీలో పిటిషన్ దాఖలుకు 6 నెలల కాలపరిమితి ఉంటుందని, ఆ సమయం మించి దాఖలైన పిటిషన్లను విచారించరాదని తెలంగాణ అదనపు అడ్వొకేట్ జనరల్ రాంచందర్‌రావు పేర్కొన్నారు. సుప్రీంకోర్టులోనూ ఈ అంశంలో పిటిషనర్లకు అనుకూలంగా తీర్పు రాలేదన్న విషయం తెలిసీ ఎన్జీటీని ఆశ్రయించారన్నారు. 2015లో ఇచ్చిన జీవో ప్రకారం.. తాగునీటి కోసమే ప్రాజెక్టు చేపట్టామని తెలిపారు. పర్యావరణ అనమతులు వచ్చే వరకూ సాగునీటి ప్రాజెక్టు పనులు చేపట్టబోమని రాంచందర్‌రావు వెల్లడించారు. తాగునీటి కోసమే అయితే అంత సామర్థ్యమున్న రిజర్వాయర్లు ఎందుకు కడుతున్నారు.. సాగునీటి కోసం కూడా ప్రాజెక్టు వినియోగించాలన్న ఉద్దేశంతోనే చేపడుతున్నట్లుంది కదా.. అని ధర్మాసనం ప్రశ్నించింది. కృష్ణాలో నిరంతరం నీరు ఉండదని, వర్షాలు తక్కువ పడినా, వరదలు లేకున్నా నాలుగేళ్లపాటు నిర్విరామంగా తాగునీరు అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ సర్కార్ ఈ ప్రాజెక్టులో భాగంగా రిజర్వాయర్లు కడుతోంందని రాంచందర్‌రావు చెప్పారు. ప్రాజెక్టు సమీప 13 మండలాలు ఫోర్లైడ్ బాధిత గ్రామాలని, భూగర్భజలాలు వినియోగం వల్ల ఇబ్బందులు వస్తున్న నేపథ్యంలో భారీ రిజర్వాయర్లు కట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ విచారణ ప్రాథమిక దశలోనే ఉందని తుది విచారణలో తప్పకుండా తమ వైఖరి వెల్లడిస్తామని కేంద్రం తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. తదుపరి వాదనలు గురువారం (నేడు) వింటామన్న ధర్మాసనం విచారణ వాయిదా వేసింది. చదవండి: టీఆర్ఎస్ జెండాను ఎత్తుకెళ్లిన దుండగులు -
పునరావాసం కోసం నిర్వాసితుల ఆందోళన
-
దేవుడితోనైనా కొట్లాడుతాం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కృష్ణా జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్తోనే కాదు.. అవసరమైతే దేవుడితోనైనా పోరాడుతామని, పాలమూరుకు నీటినందించే విషయంలో ఎలాంటి రాజీలేదని రాష్ట్ర పురపాలక, ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లాలో శనివారం ఆయన పర్యటించి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించి తీరుతామన్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి నారాయణపేట జిల్లాకు నీరందించే కెనాల్ కోసం వచ్చే నెల 10న ప్రజాభిప్రాయ సేకరణ జరగనున్నట్లు తెలిపారు. దీనిపై ఈ ప్రాంతానికి చెందిన వారే అడ్డంకులు సృష్టించే అవకాశం ఉందని పేర్కొన్నారు. జిల్లాలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులందరూ రైతులను అధిక సంఖ్యలో తీసుకొచ్చి కరివెన నుంచి నారాయణపేట వరకు చేపట్టే కెనాల్‌కు అవసరమైన భూసేకరణకు మద్దతు తెలపాలని కోరారు. నేతన్నలను అన్ని విధాలా ఆదుకుంటాం.. రూ.5 లక్షల బీమా వర్తింపజేసే పథకాన్ని రాష్ట్రంలోని నేత కార్మికులకు త్వరలో వర్తించేలా చూస్తామని కేటీఆర్ అన్నారు. 70 ఏళ్లలో ఎవరూ ఆలోచించని విధంగా ముఖ్యమంత్రి పల్లెలు, పట్టణాలను ప్రగతి బాటలో నడిపిస్తున్నారన్నారు. ప్రపంచాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేసి ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసిందని చెప్పారు. అయినా ప్రజా సంక్షేమం, అభివృద్ధిలో వెనుకడుగు వేయకుండా కేసీఆర్ నేతృత్వంలో బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరిని పండించామని.. రైతులకు ఇబ్బందుల్లేకుండా ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, వాణిదేవి, ప్రభుత్వ విప్‌లు కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఏబీవీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ సభ ప్రారంభానికి ముందు మంత్రి కాన్వాయ్‌ను ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేసి.. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగి ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేయడంతోపాటు ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తర్వాత సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తుండగా పీడీఎస్ విద్యార్థులు నిరసన తెలిపారు. పీజీ కళాశాల ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వీరిని కూడా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. -
‘పాలమూరు’ ప్రాజెక్టుల కథేంటి?
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలపై ఆధారపడి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో చేపట్టిన ఎత్తిపోతల పథకాల నిర్మాణ పనుల్లో జరుగుతున్న జాప్యంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టి పెట్టారు. ముఖ్యంగా పదిహేనేళ్ల కింద చేపట్టిన కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, గట్టు, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాలు ఇంతవరకు వందశాతం పూర్తికాలేదు. దీనికిగల కారణాలపై ఒకట్రెండు రోజుల్లో ప్రాజెక్టు ఇంజనీర్లు, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. దీనిపై ఇప్పటికే ఇరిగేషన్ శాఖకు సీఎంఓ కార్యాలయం సమాచారం అందించింది. ఈ పథకాల ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లాలో 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే అవకాశాలున్నా, ఎందుకు జాప్యం జరుగుతోందన్న దానిపై సమీక్షించి సీఎం మార్గదర్శనం చేసే అవకాశం ఉంది. నిధుల్లేక నీరసం జలయజ్ఞం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన కల్వకుర్తి ద్వారా సుమారు 5 లక్షలు, భీమా, నెట్టెంపాడుల ద్వారా చెరో 2 లక్షల ఎకరాలకు నీరందించే అవకాశం ఉంది. వీటికింద సుమారు 9 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా, ఇప్పటికే 6.50 లక్షల ఎకరాలు ఆయకట్టులోకి వచ్చింది. భూసేకరణ, పిల్ల కాల్వల నిర్మాణం పూర్తి చేస్తే ప్రాజెక్టులు వందశాతం పూర్తవుతాయి. అయితే నిధుల కొరత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో 2021–22 ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.1,500 కోట్లు నిధులు కేటాయించాలని ఇంజనీర్లు ప్రతిపాదించారు. అప్పుడు పెండింగ్ బిల్లులతో పాటు పూర్తిస్థాయిలో పనులు చేయొచ్చని పేర్కొన్నారు. అయినప్పటికీ అరకొరగా నిధుల కేటాయింపు జరిగింది. ముఖ్యంగా కల్వకుర్తి ప్రాజెక్టుకు రూ.75 కోట్లు మాత్రమే కేటాయించారు. నిజానికి దీనికింద రూ.80 కోట్లు పెండింగ్ బిల్లులు ఉండగా, భూసేకరణకు సంబంధించి మరో రూ.29 కోట్లు పెండింగ్‌లో ఉంది. ప్రస్తుత బడ్జెట్లో కేటాయించిన నిధులు పెండింగ్‌కే సరిపోతాయి. కాల్వ పనులు పూర్తిచేస్తే.. ముఖ్యంగా ప్యాకేజీ–29లో కాల్వ పనులు పూర్తి చేస్తే 57 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందే అవకాశం ఉంది. అయితే ఇక్కడ భూసేకరణకు సం బంధించి రూ.18 కోట్ల నిధులు ఏడాదిగా ఇవ్వ డం లేదు. పెండింగ్ బిల్లులు మరో రూ.40 కోట్లు ఉన్నాయి. దీంతో పనులు ముందుకే కదలట్లేదు. దీనిపై గత సమీక్షల్లో జిల్లా మంత్రి నిరంజన్‌రెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతోపాటే పాలమూరు–కల్వకుర్తికి అనుసంధానం చేసే అంశం కొలిక్కి రావాల్సి ఉంది. ఇక నెట్టెంపాడు పరి«ధిలోని మరో 50 వేల ఎకరాలకు నీరందడం లేదు. ప్రాజెక్టుకు రూ.192 కోట్ల మేర కేటాయించినా, ఇక్కడ పెండింగ్ బిల్లులు రూ.25 కోట్లు ఉన్నాయి. భీమాలోనూ ఇదే పరిస్థితి. దీంతోపాటే పాలమూరులోని కర్వెన రిజర్వాయర్ నుంచి జూరాలకు నీటిని తీసుకెళ్లే ప్రతిపాదనకు తుది మెరుగులు దిద్దాల్సి ఉంది. గట్టు ఎత్తిపోతలను ఫైనల్ చేయాల్సి ఉంది. వీటన్నింటిపై సమగ్ర వివరాలతో రావాలని సీఎం ఆదేశించడంతో ఇంజనీర్లు ఆ పనిలో నిమగ్నమయ్యారు. చదవండి: టర్కీ డిజైన్‌లో సచివాలయం మసీదులు -
కల్వకుర్తి ఆయకట్టుకు పాలమూరు నీళ్లు!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల సద్వినియోగం లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం కల్వకుర్తి కింద నిర్ణయించిన ఆయకట్టుకు పాలమూరు–రంగారెడ్డి రిజర్వాయర్ల ద్వారా నీటిని అందించేలా ప్రణాళిక రచిస్తోంది. కల్వకుర్తి కింద కనీసంగా లక్ష ఎకరాల ఆయకట్టుకు పాలమూరులోని ఏదుల, వట్టెం రిజర్వాయర్ల నుంచి నీటిని ఇవ్వడం ద్వారా స్థిరీకరణ చేసే అవకాశాలున్నాయని అంచనా వేస్తోంది. ఇప్పటికే ఈ రెండు రిజర్వాయర్లు సిద్ధమైనందున కల్వకుర్తి కాల్వలకు వీటి నుంచి లింక్ కాల్వలు తవ్వే అవకాశాలపై ప్రస్తుతం సర్వే చేయిస్తోంది. ఈ సర్వే ముగిసిన అనంతరం నీటి సరఫరాకు శ్రీకారం చుట్టనుంది. మరింత నిల్వ..ఆయకట్టుకు భరోసా కల్వకుర్తి కింద నిజానికి మొదట 2.50 లక్షల ఎకరాల ఆయకట్టును ప్రతిపాదించినా, తదనంతరం ఆయకట్టును 4.35 లక్షల ఎకరాలకు పెంచారు. నీటి కేటాయింపులు సైతం 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకు పెంచారు. ఈ నీటిని శ్రీశైలం నుంచి వరద ఉన్న రోజుల్లోనే ఎత్తిపోయాల్సి ఉంటుంది. అయితే కల్వకుర్తి పథకంలో మొత్తంగా 3.40 టీఎంసీల సామర్థ్యం ఉన్న మూడు రిజర్వాయర్లు మాత్రమే ఉన్నాయి. దీంతో వరద రోజుల్లో నీటి నిల్వ చేసే అవకాశం లేదు. ఈ దృష్ట్యానే నీటిని ఎప్పటికప్పుడు ఎత్తిపోస్తూ చెరువులు నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత చేసినా పూర్తి స్థాయి ఆయకట్టుకు నీళ్లివ్వడం కత్తిమీద సాములా మారుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే కల్వకుర్తి ఆయకట్టు పరిధిలోనే నిర్మించిన పాలమూరు–రంగారెడ్డి రిజర్వాయర్ల ద్వారా నీటిని పంపిణీ చేసే అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే తెరపైకి తెచ్చారు. అయితే పాలమూరు–రంగారెడ్డిలోని తొలి రిజర్వాయర్, పంప్‌హౌజ్ ఉన్న నార్లాపూర్ పూర్తి కాకపోవడంతో ఈ ప్రయత్నం ముందుకు పోలేదు. అయితే నార్లాపూర్ దిగువన 6.55 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఏదుల రిజర్వాయర్ పనులు 98 శాతం పూర్తయ్యాయి. దీంతో పాటే దిగువన ఉండే 16.58 టీఎంసీల సామర్థ్యం ఉండే వట్టెం రిజర్వాయర్ పనులు 60 శాతం మేర పూర్తయ్యాయి. ఈ రెండు రిజర్వాయర్లకు దగ్గరి నుంచి కల్వకుర్తి కాల్వలు వెళుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొనే కల్వకుర్తి కాల్వలను మొదట ఏదుల రిజర్వాయర్‌తో అనుసంధానించి, దీన్ని నింపుతూ, ఈ రిజర్వాయర్ ద్వారానే కల్వకుర్తిలో భాగంగా ఉండే బుద్ధారం, ఘణపురంల కింది ఆయకట్టుకు సాగునీటిని పారించే అవకాశాలున్నాయని ఇంజనీర్లు అంచనా వేశారు. దీనికోసం 25 కిలోమీటర్ల మేర లింక్ కాల్వలు తవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీనిద్వారా 40వేల ఎకరాలకు నీళ్లివ్వొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ లింక్ కెనాల్ కోసం సర్వే చేస్తున్నారు. ఈ ప్రతిపాదన ఫలించాలంటే పాలమూరులో ముంపునకు గురవుతున్న ఓ గ్రామంలో సహాయ పునరావాస ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఈ గ్రామ ఆర్అండ్ఆర్ ప్రక్రియ వేగిరం చేయాలని రెండ్రోజుల కిందే జిల్లా మంత్రులు అధికారులకు ఆదేశాలిచ్చారు. వట్టెం రిజర్వాయర్ కింద... వట్టెం రిజర్వాయర్ కింద 2–4 కిలోమీటర్ల లింక్ కెనాల్ తవ్వితే కల్వకుర్తి కింద మరో 60 వేల ఎకరాలకు నీళ్లిచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సర్వే పనులు కొనసాగుతున్నాయి. పాలమూరు–రంగారెడ్డిలోని మొదటి పంప్‌హౌస్ పనులు ఆలస్యమైనా, ఈ విధంగానే లబ్ధి తీసుకోవాలని ప్రభుత్వం ప్రణాళిక రచించింది. అయితే, వచ్చే ఏడాదికి ఈ ప్రతిపాదనను పట్టాలెక్కించే అవకాశం ఉందని ప్రాజెక్టుల అధికారులు చెప్పారు. -
అవాస్తవాలతో ఇంకెన్నాళ్లు మోసం చేస్తారు
గద్వాల అర్బన్ : పదే పదే అవాస్తవాలు చెబుతూ పాలకు లు ప్రజలను ఇంకెన్నాళ్లు మోసం చేస్తారని పాలమూరు అధ్యాయన వేదిక జిల్లా కన్వీనర్ ఎక్బాల్‌పాషా ప్రశ్నించారు. పాలమూరు ప్రయోజనాలను మంత్రి నిరంజన్‌రెడ్డి ముఖ్యమంత్రి వద్ద తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. గురువారం స్థానిక రామిరెడ్డి గ్రంథాలయంలో ప్రజా సంఘాలతో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నదీ జలాల అనుసంధానంపై, ఎప్పటికీ పూర్తి కానీ పాలమూరు ప్రాజెక్టులపై పాలమూరు అధ్యాయన వేదిక స్పష్టతతో ఉందన్నారు. కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం రీడిజైనింగ్ పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. జూరాల ప్రాజెక్టుపై 300రోజులు నీళ్లు వాడుకునే సామర్థ్యం ఉన్న నిర్మాణాలను చేపట్టాలన్నారు. నదుల అనుసంధానం డెల్టా ప్రయోజనాలకోసం దిగువన కాకుండా నీరందక దుర్భిక్షత అనుభిస్తున్న ఎగువ ప్రాంతం నుంచి అనుసంధానం జరగాలని పాలమూరు అధ్యాయన వేదిక ప్రశ్నిస్తే నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత మీ పార్టీకి ఉంటే పాలమూరు, నడిగడ్డ ప్రాంత ప్రజల పొలాల్లో నీళ్లు ఎందుకు పారడం లేదని ప్రశ్నించారు. అలాగే గట్టు ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలన్నారు. తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం లేని చిన్నోనిపల్లి రిజర్వాయర్ రద్దు చేయాలని, రైతులకు భూములు తిరిగి ఇవ్వాలన్నారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పూర్తి చేయాలన్నారు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం 15.9 టీఎంసీల ఆర్డీఎస్ వాటాను పొందే చర్యలు చేపట్టి పొలాలకు నీరందించాలన్నారు. ప్రజా జీవితాలు, పంట పొలాల దయనీయ పరిస్థితులపై ప్రజల మధ్యనే బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, టీపీఫ్ రాష్ట్ర కోశాధికారి ప్రభాకర్, సీఎల్సీ జిల్లా కార్యదర్శి సుభాన్, రైతాంగ సమితి జిల్లా కార్యదర్శి క్రిష్ణయ్య, గోపాల్‌రావు, నర్సింలు, రేణుక, నాగరాజు, క్రిష్ణ పాల్గొన్నారు. -
కర్ణాటక సీఎం కుమారస్వామికి కేసీఆర్ ఫోన్
-
కుమారస్వామితో ఫలించిన కేసీఆర్ దౌత్యం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం కర్ణాటక సీఎం కుమారస్వామితో ఫోన్లో మాట్లాడారు. జూరాలకు నీటి విడుదలపై ఆయన ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రితో చర్చించారు. జూరాల ప్రాజెక్టుకు మూడు టీఎంసీల నీటిని విడుదల చేయాలని కేసీఆర్ కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కుమారస్వామి ప్రభుత్వం ...ఒకటి, రెండు రోజుల్లో నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కుమారస్వామితో ఫలించిన కేసీఆర్ దౌత్యం కాగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఈ వేసవిలో ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను అధిగమించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కర్ణాటక ప్రభుత్వంతో నడిపిన దౌత్యం ఫలించింది. మహబూబ్ నగర్ జిల్లా ప్రజల మంచినీటి అవసరాలు తీర్చడం కోసం నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి జూరాలకు రెండున్నర టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని రిజర్వాయర్లలో నీటిమట్టం పూర్తిగా తగ్గిపోవడంతో నీటిని విడుదల చేయాల్సిందిగా కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామిని సీఎం కేసీఆర్ అభ్యర్థించారు. కేసీఆర్ అభ్యర్థనపై కర్ణాటక అధికారులతో చర్చించిన సీఎం కుమారస్వామి తెలంగాణకు నీరు అందివ్వాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని కుమారస్వామి స్వయంగా ఫోన్ చేసి సీఎం కేసీఆర్ కు తెలిపారు. ఇది మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు శుభవార్త అని కేసీఆర్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రజల తరఫున కుమారస్వామికి సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావ, స్నేహ సంబంధాలు ఇలాగే కొనసాగాలని ఇద్దరు సీఎంలు అభిప్రాయపడ్డారు. కాగా, ఈ రోజు సాయంత్రం నుంచి జూరాలకు నీటి సరఫరా ప్రారంభం కానున్నది. -
హైదరాబాద్‌కు ‘పాలమూరు’ నీళ్లు
సాక్షి, హైదరాబాద్: పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా హైదరాబాద్‌కు మంచినీటిని తీసుకుంటామని, నగరంలో ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచి నీళ్లు అందివ్వడమే లక్ష్యంగా ప్రణాళికతో ముందుకువెళతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. కృష్ణా, గోదావరి నదుల నుంచి సరిపడేంత నీటిని తరలించాలని, హైదరాబాద్‌లో మంచినీటికి కొరత లేదనే మాట రావాలని అధికారులకు ఆయన సూచించారు. హైదరాబాద్ నగర ప్రస్తుత, భవిష్యత్ అవసరాల దృష్ట్యా దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి నీళ్లు తీసుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహం రూ పొందించాలని ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ మంచినీటి సరఫరా పరిస్థితిపై క్యాంపు కార్యాలయంలో మంత్రి తలసాని, మున్సిపల్ శాఖ కార్యదర్శి ఎంజీ గోపాల్, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తదితరులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. ‘‘హైదరాబాద్ నగరం, నగరానికి ఆనుకొని ఉన్న ప్రాంతాలు కలుపుకొని, కోటీ 42 లక్షల జనాభా ఉంటుంది. వీరికి ఏడాదికి 42.58 టీఎంసీల నీరు అవసరమవుతుంది. దానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలి. నగర శివారులోని చెరువులు, మంజీరా నుంచి త్వరలో అందే కృష్ణా, గోదావరి నీటిని కూడా కలుపుకొంటే 32 టీఎంసీలు అందుబాటులోకి వస్తాయి. మిగతా లోటును భర్తీ చేసుకునేందుకు కృష్ణా, గోదావరి నుంచి నీటిని తరలించాలి. దీని కోసం ప్రత్యేక రిజర్వాయర్లు నిర్మించాలి..’’ అని సమీక్షలో సీఎం సూచించారు. హైదరాబాద్‌లో దాదాపు 9లక్షల నల్లా కనెక్షన్లు ఉన్నాయని, అన్ని ఇళ్లకు కలిపి హెచ్ఎండీఏ పరిధిలో ఇంకా ఎన్ని నల్లా కనెక్షన్లు కావాలో నిర్ధారించి ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సందర్భంగా కృష్ణా, గోదావరి నుంచి హైదరాబాద్‌కు నీటిని తీసుకువచ్చే పైపులైన్ల నిర్మాణం. పంపు హౌజ్‌లు, ట్రీట్మెంట్ ప్లాంట్ల పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. మార్గమధ్యంలో రైల్వే క్రాసింగ్‌ల వద్ద ఇబ్బందులు ఎదురవుతున్నాయని, జాతీయ రహదారుల వద్ద కూడా అనుమతులు త్వరగా రావడం లేదని చెప్పారు. దీనిపై స్పందించిన సీఎం.. వెంటనే రైల్వే శాఖ, నేషనల్ హైవేల ఉన్నతాధికారులతో మాట్లాడారు. అనుమతులు త్వరగా ఇవ్వాలన్న సీఎం వినతికి వారు సానుకూలంగా స్పందించారు. వాటర్‌గ్రిడ్ కోసం రైట్ ఆఫ్ వే చట్టం తెచ్చినట్లుగా గోదావరి, కృష్ణా నదుల నీటికోసం వేసే పైపులైన్‌కు రైట్ ఆఫ్ వే చట్టం తేవాలని అధికారులు పేర్కొన్నారు.