బెంగళూరు: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారింది. రెండు రోజుల క్రితం అధికార బీజేపీ పార్టీ అభ్యర్థులకు సంబంధించి మొదటి లిస్టును రిలీజ్ చేసింది. ఈ క్రమంలో పలువురు సీనియర్లకు బీజేపీ అధిష్టానం హ్యాండిచ్చింది. దీంతో, వారందరూ రాష్ట్రంలోని ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఈ తరుణంలో మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి బిగ్ బాంబ్ పేల్చారు. చాలా మంది నేతలు జేడీఎస్‌లో చేరేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు.
ఈ సందర్బంగా కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ.. రేపు తమ పార్టీలోకి చాలా మంది నేతలు రాబోతున్నారని ప్రకటించారు. బీజేపీ నేత దొడ్డప్ప గౌడ పాటిల్ నరిబోల్ చేరిక దాదాపు ఖాయమైపోయిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఉత్తర కర్ణాటక నుంచే తాము 30 నుంచి 40 స్థానాల్లో గెలువబోతున్నామని ఆయన కామెంట్స్ చేశారు. అలాగే, కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జేడీఎస్ ఇప్పటికే తొలి జాబితాలో అభ్యర్థులను ఖరారు చేసిందన్నారు. రేపు(శుక్రవారం) రెండో జాబితాను విడుదల చేయనున్నట్టు కుమారస్వామి స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు స్థానం కల్పించకపోవడంతో సీనియర్ నేత, లింగాయత్ వర్గంలో బలమైన నాయకుడిగా ఉన్న లక్ష్మణ్ సవాది.. బీజేపీని వీడిన విషయం తెలిసిందే. ఆయన ప్రకటన అనంతరం.. దొడ్డప్ప గౌడ పాటిల్ కూడా తాను పార్టీని వీడుతున్నట్టు తెలిపారు. కాగా, వచ్చే నెల 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. 13న ఫలితాలు వెలువడనున్నాయి.
Many leaders will join JD(S) tomorrow. (BJP leader) Doddappa Gowda Patil Naribol's name is final. We are keen to win 30 to 40 seats in Uttara Karnataka. I will release the second list of candidates tomorrow: Former CM & JDS leader HD Kumaraswamy#KarnatakaElections2023 pic.twitter.com/omsKNzILel
— ANI (@ANI) April 13, 2023
Comments
Please login to add a commentAdd a comment