బెంగళూరు: సార్వత్రిక ఎన్నికల వేళ ఈసీ అధికారులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. అందుకోసం ఎన్నికల సంఘం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. బుధవారం బెంగళూరు నుంచి హసన్ వెళ్తుండగా మార్గ మధ్యలో ఓ చెక్‌పోస్ట్ వద్ద కుమారస్వామి కాన్వాయ్‌ను నిలిపివేసిన స్టాటిక్ సర్వేలైన్స్ టీమ్(ఎస్‌ఎస్‌టీ) ఆయన వాహనాన్ని తనిఖీ చేశారు. ఆ సమయంలో కుమారస్వామి కారు ముందు సీటులో కూర్చుని ఉన్నారు. తనిఖీల అనంతరం సీఎం కాన్వాయ్ అధికారులు అక్కడి నుంచి పంపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా, కర్ణాటకలోని 28 లోక్‌సభ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 18, 23 తేదీల్లో కర్ణాటకలో పోలింగ్ జరగనుంది. ఇటీవల కర్ణాటకలోని రాజకీయ ప్రముఖుల నివాసాలపై ఆదాయ పన్ను శాఖ దాడులు కలకలం రేపిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment