
కర్ణాటక సీఎం కుమారస్వామి (ఫైల్ ఫొటో)
‘అమ్మా.. ఈ నాలుగేళ్లు మీరు ఎక్కడ పడుకున్నారు’
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఓ మహిళా రైతుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘అమ్మా.. ఈ నాలుగేళ్లు మీరు ఎక్కడ పడుకున్నారు’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. చెరకు కనీస మద్దతు ధర పెంచాలంటూ ఉత్తర కర్ణాటక చెరకు రైతులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ మహిళా రైతు కుమారస్వామి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. దీంతో సహనం కోల్పోయిన సీఎం.. ‘వీళ్లంతా నిజమైన రైతులు కాదు.. ఎవరో వారిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉసిగొల్పుతున్నారు’ అంటూ మండిపడ్డారు.
కాగా సీఎం కుమారస్వామి వ్యాఖ్యలపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘అవకాశవాది అయిన ఓ సీఎం ప్రజలకు గౌరవం ఇవ్వరు. కుమారస్వామి కూడా అలాంటి వారే. మహిళా రైతును ఇలా ప్రశ్నించడం ద్వారా ఆయన నిజమైన వ్యక్తిత్వమేమిటో బయటపడింది. నిజంగా సిగ్గుచేటు. రాష్ట్రంలోని మహిళలకు ఇది నిజంగా అవమానకరం’ అని బీజేపీ ట్విటర్ వేదికగా విమర్శలు ఎక్కుపెట్టింది.
An opportunist CM would never respect the citizens & this is exactly what CM Kumaraswamy is doing.
— BJP Karnataka (@BJP4Karnataka) November 19, 2018
Asking a women where she was sleeping for last 4 years clearly shows the individuality of Kumaraswamy.
This is beyond apologising, this is a shame & insult to women of the state. pic.twitter.com/ZFHiMP1G4c