
మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి- మాజీ సీఎం కుమారస్వామి
శివాజీనగర: నేతల అశ్లీల సీడీలు వంటివాటిని చూడడానికి నా ప్రభుత్వాన్ని కూల్చాల్సి వచ్చిందా? వారు ఇక్కడే ఉండి ప్రభుత్వాన్ని పడేయాల్సింది అని జేడీఎస్ మాజీ సీఎం కుమారస్వామి ధ్వజమెత్తారు. మంగళవారం విధానసౌధలో ఆయన మాట్లాడుతూ వీడియోలను ప్రసారం చేయరాదని ఆరుమంది మంత్రులు కోర్టుకు వెళ్లారని, అలాంటి ఐడియా ఎవరిచ్చారో? ప్రజలు వీరి గురించి ఏమనుకోవాలో? అని ఎద్దేవా చేశారు. ఇలాగ తనను కూడా అగౌరవపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment