ఇద్దరు రావణుల కథ | The Villian Kannada Movie Teaser Review | Sakshi
Sakshi News home page

Jun 30 2018 8:54 AM | Updated on Jun 30 2018 9:31 AM

The Villian Kannada Movie Teaser Review - Sakshi

అభిమానుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్న భారీ మల్టీస్టారర్‌ టీజర్‌ రీలీజ్‌ వచ్చేసింది. కన్నడ స్టార్‌ హీరోలు శివరాజ్‌కుమార్‌, సుదీప్‌లు నటించిన ‘ది విలన్‌’ టీజర్‌ గ్రాండ్‌గా విడుదలయ్యింది. ఒక్కటి కాదు.. ఇద్దరు హీరోలకు సంబంధించిన టీజర్‌లను విడివిడిగా చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. ముందుగా ఫ్యాన్స్‌ కోసం మల్టీఫ్లెక్స్‌లలో(గురువారం) ఎంపిక చేసిన స్క్రీన్‌లలో పెయిడ్‌ టీజర్‌ను వదిలిన చిత్ర నిర్మాతలు, తర్వాత నిన్న థియేటర్‌లలో, సోషల్‌ మీడియాలో వాటిని విడుదల చేశారు.

విజువల్‌ ఎఫెక్ట్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి టీజర్‌లను కట్‌ చేశారు. శివన్న, కిచ్చ సుదీప్‌లు ఇద్దరు ‘రావణ పాత్ర’ గురించి డైలాగ్‌ చెప్పటం బావుంది. అయితే అసలు విలన్‌ ఎవరు అన్న విషయంలో సస్పెన్స్‌ మెయింటెన్‌ చేశారు. జోగి ఫేమ్‌ ప్రేమ్‌(తెలుగులో యోగి) డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో  అమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్‌ దిగ్గజం మిథున్‌ చక్రవర్తి, టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు శ్రీకాంత్‌ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

ఫ్యాన్స్‌ అసంతృప్తి... నిజానికి ఈ ప్రాజెక్టు ప్రకటించి మూడేళ్లపైనే గడుస్తోంది. 2015లో కాళి టైటిల్‌తో తొలుత ఈ ప్రాజెక్టు తెరకెక్కించాలని ప్రేమ్‌ యత్నించాడు. అయితే ఇద్దరు హీరోలు కథపై అసంతృప్తి వ్యక్తం చేయటంతో డిలే అయ్యింది. చివరకు ఏడాదిన్నర తర్వాత స్క్రిప్ట్‌ పనులు ఓకే కావటంతో.. ది విలన్‌ టైటిల్‌తో షూటింగ్‌ ప్రారంభమైంది. టీజర్‌, ట్రైలర్‌ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా  ఎదురు చూస్తున్నారు. జీటీ మాల్‌లో జరిగిన ఈవెంట్‌లో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి చేతుల మీదుగా గురువారం సాయంత్రం టీజర్‌లు లాంఛ్‌ చేశారు. తొలుత పెయిడ్‌ టీజర్‌ అని ప్రకటించగానే ఫ్యాన్స్‌ నిరుత్సాహానికి గురయి ఆందోళన చేపట్టారు. అయితే డైరెక్షన్‌ వెల్ఫెర్‌ ఫండ్‌ కోసం ఇదంతా అని డైరెక్టర్‌ ప్రేమ్‌ ప్రకటించటంతో అంతా శాంతించారు. వచ్చే నెలలో ఆడియోను విడుదల చేసి, ఆగష్టులో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు. ఇద్దరు స్టార్‌ హీరోల మల్టీస్టారర్‌ కావటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement