teasers
-
సినిమాల శాంపిల్ రెడీ.. చూసేందుకు మీరు సిద్ధమా
కంప్యూటర్ వదలి నాగలి పట్టి, వ్యవసాయానికి శ్రీకారం చుట్టాడు ఓ యువకుడు. చావు కబురు చల్లగా చెబుతాడు మరో యువకుడు. గ్రామంలో జరిగే ఊహించని పరిణామాలకు భయపడతారు గ్రామప్రజలు. ఒక గ్యాంగ్‌స్టర్ అండర్‌వరల్డ్‌ని శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు? ఈ నాలుగు కథలూ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈలోపు నాలుగు సినిమాలకు సంబంధించిన చిన్న శాంపిల్‌ని ట్రైలర్, టీజర్ రూపంలో చూపించాయి ఆయా నిర్మాణసంస్థలు. శర్వానంద్ నటించిన ‘శ్రీకారం’, కార్తికేయ చేసిన ‘చావు కబురు చల్లగా..’, సముద్రఖని ‘ఆకాశవాణి’, రామ్‌గోపాల్‌వర్మ ‘డి కంపెనీ’ సినిమాలకు సంబంధించి కొత్త విశేషాలు బయటకొచ్చాయి. జోడీ కుదిరింది ‘‘రామ్‌తో కలిసి సినిమా చేయబోతున్నందుకు సూపర్ డూపర్ ఎగ్జయిటెడ్‌గా ఉన్నాను’’ అన్నారు ‘ఉప్పెన’ ఫేమ్ కృతీ శెట్టి. రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి ఓ సినిమా నిర్మించనున్న విషయం తెలిసిందే. ఇందులో కథానాయికగా ‘ఉప్పెన’ ఫేమ్ కృతీ శెట్టి పేరుని పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆమెనే ఎంపిక చేసినట్లు శుక్రవారం చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. మట్టికి.. మనిషికి మధ్య ప్రేమకథ ఉద్యోగం చేస్తున్న కంపెనీ యూఎస్ బ్రాంచ్‌కి మేనేజర్ కావాల్సిన యువకుడు వ్యవసాయం కోసం పొలంలో కాలు పెట్టాడు. నాగలి పట్టాడు. మట్టికి మనిషికి మధ్య ఉన్న ప్రేమకథను మరోసారి గుర్తు చేయడానికి శ్రీకారం చూట్టాడు. శర్వానంద్, ప్రియాంకా అరుళ్ మోహన¯Œ హీరో హీరోయిన్లుగా కిశోర్ దర్శకత్వం వహించిన ‘శ్రీకారం’ సినిమా ట్రైలర్ విడుదలైంది. కిశోర్ దర్శకత్వంలో గోపీ ఆచంట, రామ్ ఆచంట నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. బస్తీ ప్రేమకథ అబ్బాయి శవాలబండి డ్రైవర్. అమ్మాయి నర్స్. అబ్బాయికి అమ్మాయిపై లవ్వు. కానీ అమ్మాయికి అబ్బాయంటే కోపం. మరి.. ప్రేమకథ ఎలా ముగిసింది? అనే ప్రశ్నకు ‘చావు కబురు చల్లగా..’లో సమాధానం దొరుకుతుంది. కార్తికేయ, లావాణ్యా త్రిపాఠీ జంటగా అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన చిత్రం ‘చావు కబురు చల్లగా..’. కౌశిక్ దర్శకుడు. ఈ నెల 19న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇందులో బస్తీ బాలరాజుగా కార్తికేయ, మల్లిక పాత్రలో లావణ్యా త్రిపాఠీ నటించారు. గ్రామంలో అలజడి అడవికి దగ్గరగా ప్రశాంతంగా ఉన్న ఓ గ్రామంలో ఊహించని అలజడి రేగుతుంది. భయంతో గ్రామస్తులు రాత్రివేళ దేనికోసమో అన్వేషిస్తుంటారు. ఆ గ్రామంలో ఏం జరిగింది? అనే మిస్టరీ వీడాలంటే ‘ఆకాశవాణి’ చూడాల్సిందే. సముద్రఖని, వినయ్ వర్మ, తేజ కాకుమాను, ప్రశాంత్ ప్రధాన పాత్రల్లో అశ్వి¯Œ గంగరాజు దర్శకత్వంలో పద్మనాభరెడ్డి నిర్మించిన చిత్రం ‘ఆకాశవాణి’. దీని టీజర్‌ను దర్శకుడు రాజమౌళి రిలీజ్ చేశారు. ఆ స్థాయికి ఎలా ఎదిగాడు? రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘డి– కంపెనీ’. అక్షత్ కాంత్, ఇర్రా మోర్, నైనా గంగూలీ, రుద్ర కాంత్ ప్రధాన పాత్రల్లో స్పార్క్ సాగర్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ‘‘గ్యాంగ్‌స్టర్ స్థాయి నుంచి అండర్ వరల్డ్‌ని శాసించే స్థాయికి దావూద్ ఇబ్రహీం ఎలా ఎదిగాడు? 1993లో ముంబయ్‌లో జరిగిన బాంబు పేలుళ్ల సూత్రధారి ఎవరు? అనే అంశాలను ప్రస్తావించాం. ఈ 26న తెలుగు, హిందీలో చిత్రాన్ని రిలీజ్ చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
ఇద్దరు రావణుల కథ
అభిమానుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్న భారీ మల్టీస్టారర్ టీజర్ రీలీజ్ వచ్చేసింది. కన్నడ స్టార్ హీరోలు శివరాజ్‌కుమార్, సుదీప్‌లు నటించిన ‘ది విలన్’ టీజర్ గ్రాండ్‌గా విడుదలయ్యింది. ఒక్కటి కాదు.. ఇద్దరు హీరోలకు సంబంధించిన టీజర్లను విడివిడిగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ముందుగా ఫ్యాన్స్ కోసం మల్టీఫ్లెక్స్‌లలో(గురువారం) ఎంపిక చేసిన స్క్రీన్లలో పెయిడ్ టీజర్‌ను వదిలిన చిత్ర నిర్మాతలు, తర్వాత నిన్న థియేటర్లలో, సోషల్ మీడియాలో వాటిని విడుదల చేశారు. విజువల్ ఎఫెక్ట్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి టీజర్లను కట్ చేశారు. శివన్న, కిచ్చ సుదీప్‌లు ఇద్దరు ‘రావణ పాత్ర’ గురించి డైలాగ్ చెప్పటం బావుంది. అయితే అసలు విలన్ ఎవరు అన్న విషయంలో సస్పెన్స్ మెయింటెన్ చేశారు. జోగి ఫేమ్ ప్రేమ్(తెలుగులో యోగి) డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో అమీ జాక్సన్ హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ దిగ్గజం మిథున్ చక్రవర్తి, టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఫ్యాన్స్ అసంతృప్తి... నిజానికి ఈ ప్రాజెక్టు ప్రకటించి మూడేళ్లపైనే గడుస్తోంది. 2015లో కాళి టైటిల్‌తో తొలుత ఈ ప్రాజెక్టు తెరకెక్కించాలని ప్రేమ్ యత్నించాడు. అయితే ఇద్దరు హీరోలు కథపై అసంతృప్తి వ్యక్తం చేయటంతో డిలే అయ్యింది. చివరకు ఏడాదిన్నర తర్వాత స్క్రిప్ట్ పనులు ఓకే కావటంతో.. ది విలన్ టైటిల్‌తో షూటింగ్ ప్రారంభమైంది. టీజర్, ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జీటీ మాల్లో జరిగిన ఈవెంట్లో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి చేతుల మీదుగా గురువారం సాయంత్రం టీజర్లు లాంఛ్ చేశారు. తొలుత పెయిడ్ టీజర్ అని ప్రకటించగానే ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురయి ఆందోళన చేపట్టారు. అయితే డైరెక్షన్ వెల్ఫెర్ ఫండ్ కోసం ఇదంతా అని డైరెక్టర్ ప్రేమ్ ప్రకటించటంతో అంతా శాంతించారు. వచ్చే నెలలో ఆడియోను విడుదల చేసి, ఆగష్టులో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు. ఇద్దరు స్టార్ హీరోల మల్టీస్టారర్ కావటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. -
‘ది విలన్’ టీజర్
-
ఫిబ్రవరిలో వేంకటేశాయ
శ్రీవారి విశిష్ఠ భక్తుడు... శంఖు చక్ర దండధారి... హాథీరామ్ బాబాగా అక్కినేని నాగార్జున నటించిన భక్తిరస చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో సాయికృపా ఎంటర్టైన్మెంట్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై ఏ. మహేశ్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 24న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. హాథీరామ్ బాబాగా నాగార్జున, కృష్ణమ్మగా అనుష్క, వెంకటేశ్వరస్వామిగా సౌరభ్‌జైన్, కీలక పాత్రధారి ప్రజ్ఞా జైస్వాల్‌ల ఫస్ట్ లుక్స్ అన్నిటినీ టీజర్స్ రూపంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. నిర్మాత ఏ. మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ – ‘‘నాగార్జున–రాఘవేంద్రరావు కలయికలో వచ్చిన భక్తి చిత్రాలు ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘శిరిడీసాయి’ తరహాలో ఈ చిత్రం కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. త్వరలో పాటల విడుదల తేదీ ప్రకటిస్తాం. ఫిబ్రవరి 10న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. జగపతిబాబు, విమలా రామన్, రావు రమేశ్ నటించిన ఈ చిత్రానికి కథ: జె.కె. భారవి, కెమేరా: ఎస్.గోపాల్‌రెడ్డి, సంగీతం: ఎం.ఎం.కీరవాణి. -
కూతుర్ని చూసి ఈల వేశారని వెళ్లి..
త్రిసూర్: కూతురు పట్ల వెకిలిగా ప్రవర్తించిన యువకులను ప్రశ్నించడానికి వెళ్లిన ఓ తండ్రి తిరిగిరాని లోకాలకు వెళ్లిన ఘటన కేరళలోని త్రిసూర్‌లో చోటు చేసుకుంది. తన కూతుర్ని చూసి ఈల వేశారన్న కోపంతో ఆకతాయిలకు బుద్ధి చెప్పడానికి వెళ్లి ఆయన హతమయ్యాడు. రమేష్ అనే వ్యక్తి తన కూతురు(17), కుమారుడు(16)ని తీసుకొని బైక్ పై రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్తున్న సమయంలో దారిలో ముగ్గురు యువకులు ఈల వేసి వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అనంతరం కూతురు, కొడుకును ఇంటికి చేర్చిన రమేష్.. ఆ ఆకతాయిలను ప్రశ్నించడానికి వెళ్లాడు. వారితో పోట్లాడే క్రమంలో గుండెపోటుతో మృతి చెందాడు. పిల్లలు వారిస్తున్నా ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లిన రమేష్.. ఎంతకీ తిరిగిరాకపోవటంతో కుటుంబసభ్యులు మృతి వార్త తెలిసి షాక్ తిన్నారు. రమేష్‌కు గతంలో ఒకసారి మైల్డ్ హార్ట్ ఎటాక్ వచ్చిందని ఆయన బంధువులు తెలిపారు. ఈ ఘటనలో టీజింగ్‌కు పాల్పడిన యువకులపై కేసునమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
10 మంది టీజర్లకు జైలుశిక్ష
హైదరాబాద్: ఇప్పటివరకు 113 మంది టీజర్లను అదుపులోకి తీసుకున్నామని హైదరాబాద్ అడిషనల్ కమిషనర్ స్వాతి లక్రా తెలిపారు. వారిలో 10 మంది మైనర్లకు జైలు శిక్ష ఖరారైందని అన్నారు. మరో 47 మందికి కోర్టు జరిమానా విధించిందని తెలిపారు. అంతేకాకుండా 56 మంది మైనర్లకు 'షీ' టీమ్స్ కౌన్సెలింగ్ నిర్వహించాయని ఆమె తెలిపారు.