ఫిబ్రవరిలో వేంకటేశాయ | Home Film News Nagarjuna's Om Namo Venkatesaya Movie Motion Poster featuring Nagarjuna released today | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరిలో వేంకటేశాయ

Published Sat, Dec 17 2016 11:32 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

ఫిబ్రవరిలో వేంకటేశాయ - Sakshi

ఫిబ్రవరిలో వేంకటేశాయ

శ్రీవారి విశిష్ఠ భక్తుడు... శంఖు చక్ర దండధారి... హాథీరామ్‌ బాబాగా అక్కినేని నాగార్జున నటించిన భక్తిరస చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై ఏ. మహేశ్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 24న రిలీజ్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. హాథీరామ్‌ బాబాగా నాగార్జున, కృష్ణమ్మగా అనుష్క, వెంకటేశ్వరస్వామిగా సౌరభ్‌జైన్, కీలక పాత్రధారి ప్రజ్ఞా జైస్వాల్‌ల ఫస్ట్‌ లుక్స్‌ అన్నిటినీ టీజర్స్‌ రూపంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

నిర్మాత ఏ. మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ – ‘‘నాగార్జున–రాఘవేంద్రరావు కలయికలో వచ్చిన భక్తి చిత్రాలు ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘శిరిడీసాయి’ తరహాలో ఈ చిత్రం కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. త్వరలో పాటల విడుదల తేదీ ప్రకటిస్తాం. ఫిబ్రవరి 10న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. జగపతిబాబు, విమలా రామన్, రావు రమేశ్‌ నటించిన ఈ చిత్రానికి కథ: జె.కె. భారవి, కెమేరా: ఎస్‌.గోపాల్‌రెడ్డి, సంగీతం: ఎం.ఎం.కీరవాణి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement