saurabhjain
-
పసిడి సౌరభం
న్యూఢిల్లీ: మరో ఈవెంట్... మరో పసిడి పతకం... మరో ప్రపంచ రికార్డు. సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో వరుసగా రెండో రోజు భారత షూటర్ గురి అదిరింది. తొలి రోజు మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అపూర్వి చండేలా ప్రపంచ రికార్డుతోపాటు పసిడి పతకం సొంతం చేసుకోగా... రెండో రోజు ఆదివారం 16 ఏళ్ల సౌరభ్ చౌధరీ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో సంచలన ప్రదర్శన చేశాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సౌరభ్ స్వర్ణ పతకంతోపాటు కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు ఈ విభాగంలో భారత్‌కు 2020 టోక్యో ఒలింపిక్స్ బెర్త్‌ను అందించాడు. గత సంవత్సరం ఆసియా క్రీడల్లో, యూత్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు గెలిచిన సౌరభ్ చౌధరీ ప్రపంచకప్‌లో బరిలోకి దిగిన తొలిసారే పసిడి పతకాన్ని దక్కించుకోవడం విశేషం. ఎనిమిది మంది పాల్గొన్న ఫైనల్లో సౌరభ్ 245 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో ఒలె ఒమెల్చుక్ (ఉక్రెయిన్–243.6 పాయింట్లు) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును సౌరభ్ బద్దలు కొట్టాడు. దామిర్ మికెక్ (సెర్బియా–239.3 పాయింట్లు) రజతం... 2008 బీజింగ్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత పాంగ్ వె (చైనా–215.2 పాయింట్లు) కాంస్యం సాధించారు. ఫైనల్లో సౌరభ్ జోరు ఎలా సాగిందంటే చివరి షాట్కంటే ముందుగానే అతనికి స్వర్ణం ఖాయమైంది. 76 మంది పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో సౌరభ్ 587 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంతో ఫైనల్‌కు అర్హత సాధించాడు. భారత్‌కే చెందిన అభిషేక్ వర్మ 24వ స్థానంలో... రవీందర్ సింగ్ 26వ స్థానంలో నిలిచారు. ‘ప్రపంచ రికార్డు, ఒలింపిక్ బెర్త్, స్వర్ణ పతకంలాంటి అంశాల గురించి ఆలోచించకుండా లక్ష్యాన్ని గురి చూసి కొట్టాను. అనుకున్న ఫలితం వచ్చింది. ఒకవేళ వీటి గురించి ఆలోచిస్తూ షూటింగ్ చేసి ఉంటే అనవసరంగా ఒత్తిడికిలోనై తుది ఫలితం మరోలా ఉండేదేమో’ అని సౌరభ్ వ్యాఖ్యానించాడు. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత యువతార మను భాకర్ ఫైనల్లో 22 పాయింట్లు స్కోరు చేసి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. వెరోనికా మేజర్ (హంగేరి–40 పాయింట్లు) స్వర్ణం సాధించగా... జింగ్జింగ్ జాంగ్ (చైనా), హనియా రొస్తామియాన్ (ఇరాన్) రజత, కాంస్య పతకాలు గెలిచారు. క్వాలిఫయింగ్‌లో 590 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచిన మను భాకర్ ఫైనల్లో మాత్రం తడబడింది. -
ఫిబ్రవరిలో వేంకటేశాయ
శ్రీవారి విశిష్ఠ భక్తుడు... శంఖు చక్ర దండధారి... హాథీరామ్ బాబాగా అక్కినేని నాగార్జున నటించిన భక్తిరస చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో సాయికృపా ఎంటర్టైన్మెంట్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై ఏ. మహేశ్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 24న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. హాథీరామ్ బాబాగా నాగార్జున, కృష్ణమ్మగా అనుష్క, వెంకటేశ్వరస్వామిగా సౌరభ్‌జైన్, కీలక పాత్రధారి ప్రజ్ఞా జైస్వాల్‌ల ఫస్ట్ లుక్స్ అన్నిటినీ టీజర్స్ రూపంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. నిర్మాత ఏ. మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ – ‘‘నాగార్జున–రాఘవేంద్రరావు కలయికలో వచ్చిన భక్తి చిత్రాలు ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘శిరిడీసాయి’ తరహాలో ఈ చిత్రం కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. త్వరలో పాటల విడుదల తేదీ ప్రకటిస్తాం. ఫిబ్రవరి 10న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. జగపతిబాబు, విమలా రామన్, రావు రమేశ్ నటించిన ఈ చిత్రానికి కథ: జె.కె. భారవి, కెమేరా: ఎస్.గోపాల్‌రెడ్డి, సంగీతం: ఎం.ఎం.కీరవాణి.