సైరాలో చిరూతో...
...నటించే ఛాన్స్ ప్రగ్యా జైస్వాల్ చెంతకు వచ్చిందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అదీ ముగ్గురు కథానాయికల్లో ఒకరిగా! చిరంజీవి హీరోగా తొలితరం తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథతో రూపొందుతోన్న సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. ఇందులో ముగ్గురు నాయికలకు చోటుంది. అంటే... ఉయ్యాలవాడ జీవితంలో ముగ్గురు మహిళలు ప్రముఖ పాత్ర పోషించారట! అందులో ఒకరిగా నయనతారను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
స్వాతంత్య్ర పోరాటంలో ఉయ్యాలవాడకు చేదోడు వాదోడుగా నిలిచిన యోధురాలిగా ఆమె పాత్ర ఉండనుందట. మిగతా రెండిటిలో... ఒకటి యవ్వనంలో ఉయ్యాలవాడతో ప్రేమలో పడిన అమ్మాయి పాత్ర, ఇంకొకటి శక్తివంతమైన మహిళ పాత్ర అని తెలుస్తోంది. ఆ ప్రేమలో పడిన అమ్మాయి పాత్రకు ప్రగ్యాను తీసుకోవాలనుకుంటున్నారట. మరో పాత్రకు అనుష్క పేరు వినిపిస్తోంది! సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ స్వరకర్త. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి ముఖ్య తారాగణం!