
రాయచూరు : భవిష్యత్తులో దివ్యాంగులకు రూ.2500, వృద్ధులకు రూ.2 వేల వరకూ పింఛన్ పెంచుతామని ముఖ్యమంత్రి కుమారస్వామి పేర్కొన్నారు. ఆయన బుధవారం మాన్వి తాలూకా కరేగుడ్డలో పర్యటించారు. ఈ సందర్భంగా మాన్వి తాలూకా కరేగుడ్డలో ముఖ్యమంత్రి పాఠశాల గదిలో నిద్రించారు. రాత్రివేళ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రులు వెంకట్రావ్ నాడగౌడ, శాసన సభ్యులు రాజా వెంకటప్ప నాయక్, ప్రతాప్‌గౌడ పాటిల్, అమరేగౌడ, హులిగేరిలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment