
న్యూఢిల్లీ : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి సోమవారం తీహార్ జైలుకు వచ్చారు. అక్కడ జైలులో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్‌ను కుమారస్వామి కలిశారు. కర్ణాటకలోని రాజకీయ అంశాలపై కుమారస్వామి, శివకుమార్‌తో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన శివకుమార్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు.
కాగా, కాంగ్రెస్, జేడీఎస్‌ల సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో శివకుమార్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ట్రబుల్ షూటర్‌గా పేరుగాంచిన శివకుమార్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడేందకు చివరివరకు ప్రయత్నించాడు. కానీ, రెబల్ ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.