
10 సిలిండర్లు సగం ధరకు
కర్ణాటక: రాష్ట్రంలో జేడీఎస్ అధికారంలోకి వస్తే వంటగ్యాస్ సిలిండర్ ధరలను 50 శాతం తగ్గిస్తామని మాజీ సీఎం, జేడీఎస్ నాయకుడు హెచ్‌డీ కుమారస్వామి హామీ ఇచ్చారు. మంగళవారం యశవంతపురలో పంచరత్న రథయాత్రలో మాట్లాడారు. కేంద్రం ఉచితంగా గ్యాస్‌ను అందిస్తుందని ఉజ్వల యోజన పథకాన్ని నమ్మిన మహిళలు ఒక సిలిండర్ తీసుకున్న తరువాత షాక్‌కు గురయ్యారు.
ఇప్పడు సిలిండర్ ధర వెయ్యి రూపాయలు దాటిందని కుమారస్వామి ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే ఏటా ఐదు సిలిండర్లు ఉచితంగా, మరో 10 సిలిండర్లు సగం ధరకు అందిస్తామన్నారు. ఆటో డ్రైవర్లుకు ప్రతి నెల రెండు వేలు ఇస్తామన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తల దీర్ఘకాలిక డిమాండ్‌ను కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.