వారిని చంపేందుకు 29న ముహూర్తం | Threat To Kill Actor Prakash Raj Brinda Karat HD Kumaraswamy | Sakshi
Sakshi News home page

ఆ 15 మంది ప్రముఖుల్ని చంపేందుకు 29న ముహూర్తం

Published Mon, Jan 27 2020 10:38 AM | Last Updated on Mon, Jan 27 2020 3:51 PM

Threat To Kill Actor Prakash Raj Brinda Karat HD Kumaraswamy - Sakshi

బెంగళూరు: కర్ణాటకలో పలువురు ప్రముఖులను చంపుతామంటూ బెదిరింపు లేఖ ఓ ఆశ్రమానికి వచ్చింది. అందులో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌ను ఈ నెల 29 బుధవారం రోజున హతమారుస్తామంటూ పేర్కొన్నారు. అయితే వీరి హిట్ లిస్టులో మాజీ సీఎం కుమారస్వామి, బృందా కారత్‌, నిజాగుణానంద స్వామి యాక్టర్‌ చేతన్‌ కుమార్‌, భజరంగ్‌ దళ్‌ నాయకుడు మహేంద్రకుమార్‌, జర్నలిస్ట్‌ అగ్ని శ్రీధర్‌ సహా మొత్తంగా 15 మంది పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది.

కన్నడలో ఉన్న ఈ లేఖలో ధర్మానికి, దేశానికి ద్రోహం చేస్తున్నవారిని హతమార్చేందుకు జనవరి 29ని ముహూర్తంగా నిర్ణయించుకున్నామని, అందరూ తమ అంతిమ ప్రయాణానికి సిద్ధం కావాలని లేఖలో తెలిపారు. ఈ మేరకు నిజగుణానంద స్వామి మఠానికి అనేకమంది పేర్లతో కూడిన లేఖ అందింది. అయితే  ఆశ్రమ నిర్వాహకులు ఆ లేఖను జిల్లా ఎస్పీకి అందించారు. ఆశ్రమానికి అదనపు భద్రతను కల్పిస్తామని పోలీసులు చెప్పగా, నిజగుణానంద స్వామి తిరస్కరించారు. అయితే తనను కూడా హత్య చేస్తామని బెదిరింపులు వచ్చాయంటూ మాజీ సీఎం కుమారస్వామి తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement