దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తొలగించిన స్థానంలో తిరిగి పెట్టాలని ఏపీసీసీ నేతలు డిమాండ్ చేశారు. సోమవారం విజయవాడలో వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు.