ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబుపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని పీసీసీ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి ఆరోపించారు.
అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబుపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని పీసీసీ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి ఆరోపించారు. శుక్రవారం అనంతపురంలో రఘువీరారెడ్డి మాట్లాడుతూ...చంద్రబాబుపై నమ్మకం లేకే మంత్రులంతా లోకేష్ రావాలంటున్నారని తెలిపారు. టీడీపీ నేతలంతా బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అయితే రఘువీరా మడకశిరలోని గాంధీ విగ్రహం వద్ద మౌన దీక్ష చేపట్టారు. ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. గత 20 ఏళ్లుగా ఉగాది రోజున రఘువీరా ఈ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.