ఆనందపేట (గుంటూరు): ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న ఆత్మహత్యలన్నీ సర్కారీ హత్యలేనని ఏపీపీసీసీ రఘువీరారెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన గుంటూరు జిల్లా కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ప్రత్యేకహోదా కోసం ఆత్మహత్యకు పాల్పడిన పశ్చిమగోదావరి వాసి దుర్గాప్రసాద్‌ను పరామర్శించారు. అక్కడి వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్ధితి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుంటే తమ పిల్లలకు ఉద్యోగాలు రావని కలత చెంది ఆత్మహత్యకు పాల్పడటం విచారకరమన్నారు.
తన క్యాంపు కార్యాలయానికి రూ.100 కోట్లు ఖర్చు పెట్టుకుంటున్న చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యలకు పాల్పడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించటంలో విఫలమయ్యారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలు కట్టిపెట్టి ప్రత్యేక హోదాపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లాది విష్ణు, జంగా గౌతమ్, మక్కెన మల్లికార్జునరావు, మస్తాన్‌వలి పాల్గొన్నారు.
'ఆత్మార్పణలన్నీ సర్కారీ హత్యలే'
Published Sun, Aug 30 2015 7:25 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement
Advertisement