'పవన్ కల్యాణ్కు ఆ విషయం తెలియదు' | apcc chief raghuveera reddy respond on pawan kalyan comments | Sakshi
Sakshi News home page

'పవన్ కల్యాణ్కు ఆ విషయం తెలియదు'

Published Mon, Jul 13 2015 4:34 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

'పవన్ కల్యాణ్కు ఆ విషయం తెలియదు' - Sakshi

'పవన్ కల్యాణ్కు ఆ విషయం తెలియదు'

జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి స్పందించారు.

హైదరాబాద్: జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ ఏడాదిగా పోరాడుతోందని రఘువీరా అన్నారు.

ఇదే అంశంపై ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ.. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ కూడా రాశారని చెప్పారు. కాంగ్రెస్ కేడర్ కోటి సంతకాల సేకరణతో పాటు నిరసన తెలియజేస్తోందని, పవన్ కల్యాణ్కు ఈ సమాచారం తెలియకపోవడం వల్లే ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పోరాడాలని మాట్లాడారని రఘువీరా అన్నారు. అంతకుముందు పవన్ కల్యాణ్.. ఏపీ ప్రత్యేక హోదాను కాంగ్రెస్ నేతలు గాలికొదిలేశారని, లలిత్ మోదీ వివాదానికే ఆపార్టీ పరిమితమైందని ట్విటర్లో వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement