'పోలవరం సాధనే ఎజెండాగా పోరాడతాం' | our agenda is polavaram project, says raghuveera reddy | Sakshi
Sakshi News home page

'పోలవరం సాధనే ఎజెండాగా పోరాడతాం'

Published Fri, Apr 3 2015 8:53 PM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

'పోలవరం సాధనే ఎజెండాగా పోరాడతాం' - Sakshi

'పోలవరం సాధనే ఎజెండాగా పోరాడతాం'

హైదరాబాద్: పో్లవరం ప్రాజెక్టు సాధనే తమ ప్రధాన ఎజెండాగా పోరాడతామని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఇందిరాభవన్ లో సమావేశమైన ఏపీ కాంగ్రెస్ సమన్వయ కమిటీలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సమావేశానికి చిరంజీవి, బొత్స సత్యనారాయణ, ఆనం తదితరులు హాజరయ్యారు.  భేటీ ముగిసిన అనంతరం రఘువీరా మీడియాతో మాట్లాడుతూ.. పట్టిసీమ ప్రాజెక్టుపై వివిధ ప్రజా సంఘాలతో వర్క్ షాపులు నిర్వహిస్తామన్నారు. ఎన్నికల్లో పెట్టిన ఖర్చు రాబట్టేందుకే ఏపీ సర్కార్ పట్టిసీమ ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చిందని ఎద్దేవా చేశారు.

 

పోలవరం ప్రాజెక్టు సాధనే తమ లక్ష్యంగా పోరాడతామని రఘువీరా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈనెల 9 తేదీల్లో విశాఖలో ఏపీసీసీ విస్తృత స్థాయి సమావేశాలు ఉంటాయన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కోటి సంతకాల సేకరణపై చర్చిస్తామని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement