పడవ ప్రమాదంపై పీసీసీ నిజనిర్ధారణ కమిటి | APCC Forms Committee to Find Cause of Boat Capsization | Sakshi
Sakshi News home page

పడవ ప్రమాదంపై పీసీసీ నిజనిర్ధారణ కమిటి

Published Mon, Nov 13 2017 2:57 PM | Last Updated on Wed, Apr 3 2019 5:24 PM

APCC Forms Committee to Find Cause of Boat Capsization - Sakshi

సాక్షి, విజయవాడ : కృష్ణా నదిలో జరిగిన పడవ ప్రమాదంపై కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ కమిటీ నియమిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు ఎన్‌.రఘువీరా రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. పడవ ప్రమాదం తనను ఎంతగానో కలిచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఈ ఘటన జరిగిందన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, మాజీ ఎమ్మెల్యే మస్తాన్‌ వలీ ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీని నియమిస్తున్నట్లు వివరించారు.

ఈ కమిటీలో ఏపీసీసీ ప్రధాన కార్యదర్శులు సూరిబాబు, మీసాల రాజేశ్వరరావు, అధికార ప్రతినిధి, డీసీసీ అధ్యక్షుడు ధనేకుల మురళి, నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్‌లు ఉంటారన్నారు. ఈ కమిటీ  ఈ నెల 14న ఉదయం 10 గంటలకు పవిత్ర సంగమం వద్దకు వెళ్లి ప్రమాదస్ధలిని పరిశీలిస్తుందని తెలిపారు. అనంతరం బాధితుల బంధువులతో మాట్లాడి నివేదిక సమర్పిస్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement