ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుపై పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి శనివారం విశాఖపట్నంలో నిప్పులు చెరిగారు.
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుపై పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి శనివారం విశాఖపట్నంలో నిప్పులు చెరిగారు. చంద్రబాబు అసమర్థతవల్లే తెలంగాణలో అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నారని ఆయన ఆరోపించారు. ఓటుకు కోట్లు కేసుకు భయపడే చంద్రబాబు ఈ అంశంపై మాట్లాడటం లేదని విమర్శించారు. కేసీఆర్ సంతకం పెడితే చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖామన్నారు. ప్రత్యేక హోదాపై అన్ని పక్షాలను కలుపుకుని పోరాడతామని రఘువీరారెడ్డి చెప్పారు.