జయ మృతి పట్ల ఏపీ పీసీసీ సంతాపం | AP PCC leaders pays tribute to tamilnadu cm jayalalithaa | Sakshi
Sakshi News home page

జయ మృతి పట్ల ఏపీ పీసీసీ సంతాపం

Published Tue, Dec 6 2016 5:55 PM | Last Updated on Sat, Aug 18 2018 9:13 PM

జయ మృతి పట్ల ఏపీ పీసీసీ సంతాపం - Sakshi

జయ మృతి పట్ల ఏపీ పీసీసీ సంతాపం

అమరావతి: తమిళనాడు సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మృతిపట్ల పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో పీసీసీ నేతలతో మంగళవారం సమావేశమైన ఆయన తొలుత జయలలిత మృతికి కొంతసేపు మౌనం పాటించారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ రాజకీయాల్లో ఎన్ని ఇబ్బందులున్నా మహిళలు అధిగమించగలరని నిరూపించిన మహిళానేత జయలలిత అన్నారు.

ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో చెన్నై అపోలో ఆస్పత్రిలో ఆమెను ఐసీయూకు షిఫ్ట్ చేసి వైద్యులు చికిత్స అందిస్తుండగా.. సోమవారం రాత్రి దాదాపు 11:30 గంటల సమయంలో జయలలిత కన్నుమూసిన విషయం తెలిసిందే. జయలలిత అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం చెన్నై మెరీనా బీచ్‌లో ఎంజీఆర్ సమాధి పక్కనే నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement