వాళ్ల కంటే బిచ్చగాళ్లు నయం: రఘువీరారెడ్డి | raghuveera reddy slams tdp on diffamation | Sakshi
Sakshi News home page

వాళ్ల కంటే బిచ్చగాళ్లు నయం: రఘువీరారెడ్డి

Published Wed, Apr 27 2016 6:21 PM | Last Updated on Sat, Aug 18 2018 9:13 PM

వాళ్ల కంటే బిచ్చగాళ్లు నయం: రఘువీరారెడ్డి - Sakshi

వాళ్ల కంటే బిచ్చగాళ్లు నయం: రఘువీరారెడ్డి

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు బిచ్చగాళ్లకంటే హీనులని ఏపీ పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి విమర్శించారు. అనంతపురం జిల్లాలోని మడకశిరలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను సాంఘిక బహిష్కరణ చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.

 

పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమకు ఓట్లు వేసిన ప్రజలను అవమానపర్చినట్లేనని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీకి ఒక రాజ్యసభ సీటు దక్కే అవకాశం ఉండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైఎస్సార్‌సీపీకి ఆ ఒక్క సీటు రాకుండా అడ్డుపడేందుకు దాదాపు రూ.500 నుంచి రూ.600 కోట్ల వరకు డబ్బులు వెదజల్లి ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు.

 ముఖ్యమంత్రి తాను చేసిన తప్పులు, అవినీతిని ఎవరూ ప్రశ్నించకూడదని భావించి రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయడానికి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని అన్నారు. పార్టీ మారే ఎమ్మెల్యేలు తప్పని సరిగా పదవికి రాజీనామా చేసేవిధంగా ఫిరాయింపు చట్టంలో మార్పులు చేయాలని తెలిపారు. ఎమ్మెల్యేలు సిద్ధాంతాలను పక్కనపెట్టి కేసులు మాఫీ చేసుకోవడానికి, పదవుల కోసం, డబ్బులకు అమ్ముడుబోతున్నారని విమర్శించారు. ఫిరాయింపులకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement