'మోదీకి ధైర్యముంటే వాటికి సమాధానం చెప్పాలి'
విజయవాడ : పెద్ద నోట్ల రద్దు పెద్ద కుంభకోణమని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి విమర్శించారు. నోట్ల రద్దు అనంతరం ఎంత నల్లధనం బయటకు వచ్చిందో ప్రధాని మోదీ లెక్కచెప్పాలన్నారు. మోదీకి ధైర్యముంటే రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ, చంద్రబాబులు క్యాష్‌లెస్ విధానం కాదు.. బ్రెయిన్ లెస్ విధానం అవలంభిస్తున్నారని విమర్శించారు. కొంత మంది పెద్దలు పెద్ద నోట్ల ముసుగులో నల్ల ధనాన్ని తెల్ల ధనంగా మార్చుకున్నారన్నారు.
పెద్ద నోట్ల రద్దు విషయం చంద్రబాబుకు ముందే తెలుసని టీడీపీ నాయకులు అంతా ముందే సర్దుకున్నారని ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ ఎస్‌బీఐ జోనల్ ఆఫీసు కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహించింది. నోట్ల రద్దు వలన ప్రజలు పడుతున్న ఇబ్బందులను వినతి పత్రం ద్వారా ఎస్‌బీఐ జోనల్ మేనేజర్కు కాంగ్రెస్ నాయకులు సమర్పించారు.