‘సంతకం రఘురాంది ఉండాలిగా.. ఉర్జిత్‌ది ఎలా?’ | apcc chief raghuveera takes on pm modi | Sakshi
Sakshi News home page

‘సంతకం రఘురాంది ఉండాలిగా.. ఉర్జిత్‌ది ఎలా?’

Published Sun, Nov 27 2016 1:43 PM | Last Updated on Sat, Aug 18 2018 9:03 PM

‘సంతకం రఘురాంది ఉండాలిగా.. ఉర్జిత్‌ది ఎలా?’ - Sakshi

‘సంతకం రఘురాంది ఉండాలిగా.. ఉర్జిత్‌ది ఎలా?’

హైదరాబాద్‌: పెద్ద నోట్ల రద్దుపై ప్రధాని నరేంద్రమోదీ తీసుకుంది ఏకపక్ష నిర్ణయం అని, అది సామాన్యులకు, రైతులు, మహిళలు, పేదలకు మరణ శాసనంగా మారిందని ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ చీఫ్‌ రఘువీరా రెడ్డి అన్నారు. పెద్ద నోట్ల రద్దు పేరిట భారీ ఎత్తున కుంభకోణం జరిగిందని, దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రధానికి సంబంధించిన వారి నల్లడబ్బును తెల్లడబ్బుగా మార్చుకునేందుకే పెద్ద నోట్ల రద్దు చేశారని అన్నారు.

సామాన్యులంటే మోదీకి లెక్కే లేకుండా పోయిందని, పార్లమెంటుకు గౌరవం ఇవ్వని మోదీ.. మైకు దొరికితే మాత్రం ఊకదంపుడు ఉపన్యాసాలు తెగ చేస్తారని విమర్శించారు. 2000 రూపాయల నోటు మీద ఉర్జిత్‌ పటేల్‌ సంతకం ఉందని, అయితే, ఆర్థిక కార్యదర్శి మాత్రం నోట్లు ఆరు నెలల కింద నుంచే ముద్రిస్తున్నట్లు చెప్పారని, అదే నిజమైతే.. రఘురాం రాజన్ సంతకం ఉండాలిగా అని ప్రశ్నించారు. ఈ విషయంపై దర్యాప్తు చేయాల్సిందేనని రఘువీరా డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement