చిరంజీవి
హైదరాబాద్: ఇందిరా భవన్లో ఈరోజు జరిగిన ఏపీసీసీ విస్తృత స్థాయి సమావేశానికి ఆ పార్టీ నేతలు చిరంజీవి, పల్లంరాజు, కిషోర్చంద్రదేవ్, చింతా మోహన్ డుమ్మాకొట్టారు. అయితే పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యంపై భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేసిన మే 26న, సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేసిన జూన్ 8న నిరసనలు తెలపాలని తీర్మానించారు.
ఏపీకి ప్రత్యేక హోదా హామీ అమలు చేయాలని సేకరించిన కోటి సంతకాల పత్రాలను రాష్ట్రపతికి ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. హామీలు అమలులో టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీఈసీకి ఫిర్యాదు చేసే యోచనలో ఏపీసీసీ ఉంది.