మోదీ ఒక పిరికిపంద: రఘువీరా | Raghuveera reddy slams Modi | Sakshi
Sakshi News home page

మోదీ ఒక పిరికిపంద: రఘువీరా

Published Fri, Apr 6 2018 2:11 PM | Last Updated on Sat, Aug 18 2018 9:03 PM

Raghuveera reddy slams Modi - Sakshi

ఏపీసీసీ చీఫ్‌ ఎన్‌ రఘువీరా రెడ్డి(పాత చిత్రం)

విశాఖపట్నం : ఎన్డీయే ప్రభుత్వం క్రూరమైన చర్యలను ఖండిస్తున్నామని ఏపీసీసీ అధ్యక్షులు రఘవీరా రెడ్డి తెలిపారు. విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ..ఇరవై పార్టీలు అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చినా,  మోదీ పరుగెత్తిపోయాడని, మోదీ ఒక పిరికిపంద అంటూ తూర్పారబట్టారు. పార్లమెంటులో చర్చకు రాకుండా సమావేశాలను నిరవధిక వాయిదా వేయడాన్ని ఖండిస్తున్నట్లు వెల్లడించారు.

ఆర్ధిక నేరస్తులు లలిత్ మోదీ, నీరవ్ మోదీలు పోలీసులకు, దొరక్కుండా ఎలా పారిపోయారో, ఆ రకంగా చట్టానికి, పార్లమెంటుకు దొరక్కుండా పోయిన నేరస్తుడు, క్రిమినల్ మోదీ అని తీవ్రంగా విమర్శించారు. ఈ నెల 11 న కాంగ్రెస్ పెద్దలతో నాలుగేళ్ల పోరాటాలపై సమీక్షించి, భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని ఈ సందర్భంగా చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement