ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవినీతిపరుడని, ఆయన అవినీతిని రక్షిస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు డా. ఎన్ రఘువీరా రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీసీసీ ఉపాధ్యక్షులు సూర్యానాయక్, ప్రధాన కార్యదర్శులు జంగా గౌతమ్, రవిచంద్రారెడ్డి, లీగల్ సెల్ చైర్మన్ సుందర రామశర్మలతో కలిసి మాట్లాడిన ఆయన పెద్ద నోట్ల రద్దు వ్యవహారం వెనుక భారీ కుంభకోణం ఉందన్నారు.