'అనంతపురం దాకా పాదయాత్ర చేస్తా'
అనంతపురం: పోలవరం కోరుతూ కళ్యాణదుర్గం నుంచి అనంతపురం దాకా పాదయాత్ర చేస్తానని ఏపీసీసీ రఘువీరారెడ్డి అన్నారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
రుణాల మాఫీ పేరుతో రైతులను, మహిళలను నిలువునా మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలని రఘువీరా ఈ సందర్ఘంగా చంద్రబాబుకు సవాల్ విసిరారు.