విజయవాడ: రాష్ట్ర మహిళా కాంగ్రెస్ సదస్సును ఈ నెల 29న విజయవాడలో నిర్వహించనున్నట్లు కొత్తగా ఎన్నికైన మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ భక్త తెలిపారు. ఆంధ్రరత్నభవన్‌లో ఆమె విలేకరులతో మాట్లాడారు. 29న ఉదయం 10 గంటలకు ఐవీ ప్యాలెస్‌లో జరిగే సదస్సుకు ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి హాజరుకానున్నట్లు చెప్పారు.
అదే రోజు తాను మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిపారు. ఏడాది పాలనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని విమర్శించారు. రుణమాఫీ పేరు చెప్పి ఓట్లు దండుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు మహిళల్ని మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.
29న మహిళా కాంగ్రెస్ రాష్ట్ర సదస్సు
Published Tue, May 26 2015 3:03 PM | Last Updated on Sat, Aug 18 2018 6:14 PM
Advertisement
Advertisement