
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడం కోసం కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్, కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ రాష్ట్రంలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులతో భేటి అయ్యారు. ఆదివారం ఇందిరా భవన్‌లో ఊమెన్ చాందీ సమావేశం నిర్వహించారు. తనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏపీలో జరిగే పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ వివరాలను వెల్లడించారు. ఈ నెల 9 నుంచి 13 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలలో పర్యటనలు చేస్తామని చెప్పారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడంలో భాగంగా పర్యటన జరుగుతుందని అన్నారు.
ఈ పర్యటనలో గ్రామస్థాయి నాయకుల నుంచి అసెంబ్లీ స్థాయి నేతల వరకు అందరితో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. పార్టీలోని కార్యకర్తల మధ్య ఎటువంటి అంతరం లేకుండా సమన్వయంతో పనిచేసేలా సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శులు క్రిస్టోఫర్, పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, కేవీపీ రామచంద్రారావు, మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, పళ్ళంరాజు, జేడీ శీలం, రుద్రరాజు పద్మరాజు తదితరులు నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment