indira bhavan
-
అండగా ఉన్నోళ్లనే అక్కున చేర్చుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ భావజాలానికి కట్టుబడి, ప్రతికూల పరిస్థితుల్లోనూ పార్టీకోసం నిలబడిన వ్యక్తులను ప్రోత్సహించాలని, కష్ట సమయాల్లో పార్టీని వీడిన నేతలను దూరం పెట్టాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించారు. ‘పార్టీకి సైద్ధాంతికంగా కట్టుబడి ఉన్న వ్యక్తులను ప్రోత్సహించండి. కష్ట సమయాల్లో పారిపోయే బలహీనులకు దూరంగా ఉండండి. కొన్నిసార్లు పార్టీని బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా కష్టకాలంలో పార్టీని వీడిన నేతలను తొందరపడి చేర్చుకుంటారు. మనం అలాంటి వ్యక్తులను దూరం పెడదాం’ అని పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలోని కాంగ్రెస్ నూతన ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శులు, వివిధ రాష్ట్రాల ఇన్‌ఛార్జీలతో ఖర్గే సమావేశమయ్యారు. ఈ భేటీకి పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పార్టీ పటిష్టత, భవిష్యత్ ప్రణాళికలపై ఆ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడారు. ‘పార్టీని బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు బలోపేతంం చేసే బాధ్యతను ప్రధాన కార్యదర్శులు, ఇన్ఛార్జీలు తీసుకోవాలి. ఈ పని కోసం మీరే బూత్‌కు వెళ్లాలి. కష్టపడి పనిచేయాలి. కార్మికులతో సంభాషించాలి. పార్టీ విభాగాలతో చర్చించాలి. సంస్థ పునర్ నిర్మాణంలో ఇండియన్ నేషనల్ ట్రేడ్‌యూనియన్ కాంగ్రెస్ (ఐఎన్టీయూసీ) ని భాగస్వామ్యులను చేయండి’’ అని ఖర్గే సూచించారు. ‘‘రాష్ట్రాల్లో పార్టీ నిర్వహణ, భవిష్యత్తు ఎన్నికల ఫలితాలకు ఆయా రాష్ట్రాల ఇన్‌ఛార్జీలే బాధ్యత వహించాలి. ప్రత్యర్థి పార్టీలు ఎన్నికల సమయంలో మన పార్టీ మద్దతుదారుల పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించడమో లేక ఆ పేరును మరో బూత్‌లోకి మార్చడమో చేస్తున్నారు. ఈ రిగ్గింగ్‌ను ఎలాగైనా మనం ఆపాలి’’ అని ఖర్గే పిలుపునిచ్చారు. -
ప్రజల మనిషి సంజీవయ్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్లను ప్రారంభించింది, అవినీతి నిరోధక శాఖను ఏర్పాటు చేసింది దామోదరం సంజీవయ్యేనని మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు గుర్తు చేశారు. సింగరేణిలో బోనస్ విధానాన్ని అమలు చేసి బోనస్ సంజీవయ్య అని పేరు తెచ్చుకున్నారన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో విప్లవాత్మక విధానాలు, పథకాలను ప్రజల కోసం తీసుకొచ్చారని చెప్పారు. ఉమ్మడి ఏపీ సీఎం, ఏఐసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన సంజీవయ్య శత జయంతి ఉత్సవాలు సంజీవయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్, మాజీ ఎంపీ వి. హనుమంతరావు అధ్యక్షతన ఇందిరాభవన్‌లో సోమవారం ఘనంగా జరిగాయి. శ్రీధర్‌బాబు మాట్లాడుతూ సంజీవయ్య జీవిత చరిత్ర నేటి యువతరానికి స్ఫూర్తి కావాలని ఆకాంక్షించారు. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని తానే ముఖ్యమంత్రి అయి కేసీఆర్ మోసం చేస్తే దేశంలోనే తొలి దళిత సీఎంను చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు. కర్నూలు జిల్లాకు సంజీవయ్య పేరు పెట్టాలని జగన్‌ను కోరతా: గద్దర్ కాంగ్రెస్ పార్టీ ఉదారమైన పార్టీ అని, ఆ పార్టీలో ఎంతో మంది త్యాగధనులున్నా రని, వారి త్యాగాలకు వెలకట్టలేం కానీ విలువ కట్టాలని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని ఏపీ సీఎం జగన్‌ను కలిసి కోరతానన్నారు. కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, కె.శ్రీనివాస్, కాం గ్రెస్ నేత పొన్నాల, కోదండరెడ్డి, మహేశ్‌కుమార్ గౌడ్, బొల్లు కిషన్, వినోద్ కుమార్, సంజీవయ్య సోదరుడు నాగేందర్ పాల్గొన్నారు. -
పీవీ ప్రపంచ మేధావి: శశి థరూర్
సాక్షి, హైదరాబాద్: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా విదేశీ విధానాలపై ఇందిరాభవన్‌లో ఆదివారం వెబ్‌నార్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ శశిథరూర్ పాల్గొని ప్రసంగించారు. శిశిథరూర్ మాట్లాడుతూ.. విదేశాంగ విధానం విషయంలో పీవీ నర్సింహరావు చెరగని ముద్ర వేశారని కొనియాడారు. అమెరికాతో ఆర్థికంగా బలమైన ఒప్పందాలు చేసుకొని, విదేశాంగ విధానంలో అనేక మార్పులు తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఇరాన్‌తో పటిష్టమైన బంధం ఏర్పరిచారని, దక్షిణాసియా దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడంతో పాటు లుక్ ఈస్ట్, లుక్ వెస్ట్ పాలసీ రూపొందించారని చెప్పారు. (ఎన్ఎస్యూఐ దీక్ష విరమణ) చైనా ఆధిపత్యాన్ని నిలువరించేందుకు అనేక వ్యూహాలు రచించి, కమ్యూనిజం నుంచి క్యాపిటలిజం వైపు వేగంగా అడుగులు వేశారని వ్యాఖ్యానించారు. ఆర్థికంగా ప్రపంచ దేశాలకు ఒక రోల్ మోడల్‌గా నిలిచి, రాజీవ్ గాంధీ అడుగు జాడల్లో నడిచి ఆర్థికంగా దేశాన్ని పటిష్టమైన స్థానానికి చేర్చారని అన్నారు. కేవలం 1991 నుంచి రెండేళ్లలో లిబరలైజేషన్‌తో 36 శాతం ఎకానమి పెంపొందించారని చెప్పారు. దేశ ఆర్థిక విధానాల విషయంలో పీవీ నర్సింహరావుకు ముందు ఆ తర్వాత అని చెప్పుకోవచ్చుని వివరించారు. పీవీ నేతృత్వంలో భారత్ ప్రపంచ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిందని చెప్పారు. 1991 నుంచి 5 ఏళ్ల పాటు ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ సహకారంతో ఎకానమిని పరుగులు పెట్టించారని అన్నారు. పీవీ ప్రతీ నిర్ణయం దేశం అభ్యున్నతికి పాటుపడిందని, మైనారిటీ ప్రభుత్వాన్ని తన రాజకీయ చాణక్యంతో నడపగలిగారని కొనియాడారు. ఆయన ప్రపంచ మేధావని దాదాపు 10 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగే మేధస్సు ఉన్న గొప్ప వ్యక్తి అని అన్నారు. న్యూక్లియర్ వెపన్స్ టెక్నాలజీ సాధించడంలో కీలకపాత్ర పోషించి, ఇజ్రాయిల్ సాంకేతిక సహకారంతో సైన్యాన్ని పటిష్టం చేశారని తెలిపారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్, కమిటీ చైర్మన్ గీతరెడ్డి, ఎమ్యెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ వి.హనుమంత రావ్, కమిటీ సభ్యులు మాజీ ఎంపీ మల్లు రవి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి హర్కర వేణుగోపాల్, శ్రవణ్‌రెడ్డి పాల్గొన్నారు. -
విజయారెడ్డి హత్యను ఖండిస్తున్నాం: కుంతియా
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలపై డిసెంబర్ మొదటి వారంలో ఢిల్లీలో ఆందోళన కార్యక్రమం చేపట్టనున్నామని ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జి ఆర్సీ కుంతియా పేర్కొన్నారు. హైదరాబాద్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్‌కుమార్ యాదవ్ అధ్యక్షతన బుధవారం ఇందిరా భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లు బడే భాయ్.. ఛోటా భాయ్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ సచివాలయాన్ని కూల్చి వేయాలని చూస్తుంటే .. మోదీ పార్లమెంట్ కూల్చాలని చూస్తున్నారని ఆరోపించారు. దేశ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర మంత్రులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అదే విధంగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ దేశ ఆర్థిక పరిస్థితిని హృతిక్ రోషన్ సినిమా కలెక్షన్లతో పోల్చడాన్ని కుంతియా తప్పుబట్టారు. ఆర్టీసీ సమ్మెపై కోర్టు ఇచ్చిన ఆదేశాలను సైతం కేసీఆర్ పట్టించుకోక పోవడంపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మెజార్టీ రైతులకు రైతుబంధు డబ్బులు అందలేదన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, నిజాయితీగా పనిచేసే అధికారులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. అదేవిధంగా ఈనెల 8న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ఆందోళనలతో పాటు 16న హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. కర్ణాటక మాజీ మంత్రి హెచ్‌కే పాటిల్ మాట్లాడుతూ.. బీజేపీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉందని, తక్షణమే ఆర్థిక ఎమర్జెన్సీని ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి కంటే పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మోదీ ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలను జనంలోకి ఉద్యమ రూపంలో తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కార్యాచరణ రూపొందించిందని చెప్పారు. దేశంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోమాలో.. వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు వెంటిలేటర్‌పై ఉందంటూ ఎద్దేవా చేశారు. మోదీ విధానాలు అన్నీ సామాన్యులకు వ్యతిరేకంగా ఉండడంతో.. పారిశ్రామిక వృద్ధి రేటు గణనీయంగా పడిపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఆర్సీ కుంతియా, హెచ్‌కే పాటిల్, భట్టి విక్రమార్క, జానా రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, బోసు రాజు, దాసోజు శ్రవణ్, బొల్లు కిషన్, కోదండ రెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. -
రేపు కాంగ్రెస్ వ్యవసాయ ‘భేటీ’
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రంగంలో తీసుకురావాల్సిన మార్పులు, మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై చర్చించేందుకు ఈనెల 10న (బుధవారం) కాంగ్రెస్ ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. కాంగ్రెస్ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై ప్రజలు, మేధావులు, నిపుణులతో చర్చించనున్నట్లు సెల్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి సోమవారం వెల్లడించారు. ఏఐసీసీ మేనిఫెస్టో కమిటీ సభ్యులుగా ఉన్న పంజాబ్ మంత్రి మన్‌ప్రీత్ బాదల్, రజనీపాటిల్లు సమావేశానికి హాజరవుతారని ఆయన తెలిపారు. 10న ఉదయం 10:30 గంటలకు ఇందిరా భవన్లో జరిగే ఈ సమావేశానికి వ్యవసాయ రంగంపై ఆసక్తి ఉన్న వ్యక్తులు, సంఘాలు, ప్రతినిధులు హాజరై తమ సూచనలు తెలియజేయవచ్చని వెల్లడించారు. -
9 నుంచి ఏపీలో ఉమెన్ చాందీ పర్యటన
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడం కోసం కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్, కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ రాష్ట్రంలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులతో భేటి అయ్యారు. ఆదివారం ఇందిరా భవన్లో ఊమెన్ చాందీ సమావేశం నిర్వహించారు. తనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏపీలో జరిగే పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ వివరాలను వెల్లడించారు. ఈ నెల 9 నుంచి 13 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలలో పర్యటనలు చేస్తామని చెప్పారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడంలో భాగంగా పర్యటన జరుగుతుందని అన్నారు. ఈ పర్యటనలో గ్రామస్థాయి నాయకుల నుంచి అసెంబ్లీ స్థాయి నేతల వరకు అందరితో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. పార్టీలోని కార్యకర్తల మధ్య ఎటువంటి అంతరం లేకుండా సమన్వయంతో పనిచేసేలా సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శులు క్రిస్టోఫర్, పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, కేవీపీ రామచంద్రారావు, మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, పళ్ళంరాజు, జేడీ శీలం, రుద్రరాజు పద్మరాజు తదితరులు నాయకులు పాల్గొన్నారు. -
‘బీజేపీ నేతల ఇళ్లల్లో క్యాష్ ఫుల్’
సాక్షి, హైదరాబాద్ : మోసకారి నరేంద్ర మోదీ రాక్షస పాలనకు నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మే 26న రణ శంఖారావం పూరించనున్నామని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి తెలిపారు. ఇందిరాభవన్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీపై ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌కు 10 సంవత్సరాల ప్రత్యేక హోదా, 100 రోజుల్లో నల్లధనం వెలికితీస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. బ్యాంకులను మోసం చేసిన మోదీ సన్నిహితులు నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, లలిత్ మోదీలు విదేశాల్లో దర్జాగా ఉన్నారన్నారు. రఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్లలో అవినీతి, వ్యాపం కుంభకోణం మోదీ హయాంలోనే వెలుగు చూశాయన్నారు. ‘పెద్ద నోట్ల రద్దు పెద్ద కుంభకోణం. దీనివల్ల బ్యాంకింగ్ వ్యవస్థ అస్తవ్యస్తమైంది. బ్యాంకుల్లో క్యాష్ నిల్, బీజేపీ నేతల ఇళ్లల్లో క్యాష్ ఫుల్‌గా పరిస్థితి మారింది. దళిత, ఎస్టీ, మైనారిటీలను రెండో శ్రేణి పౌరులుగా మోదీ ప్రభుత్వం చూస్తోంది. మహిళలు, బాలికలకు రక్షణ కొరవడింది. పార్టీ ఫిరాయింపు చట్టాన్ని తుంగలో తొక్కి గోవా, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటకలో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచి ఎమ్మెల్యేలను కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను అనూహ్యంగా పెంచుతున్నారు. రాజ్యాంగ వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. మోదీ పాలన రాక్షస పాలన. దీన్నిఅంతమొందించాల’ని ప్రజలకు రఘువీరా పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ సాధ్యం కాదని, మోదీ ముక్త్ బీజేపీ కోసం ఆ పార్టీకి చెందిన వారే ఎదురుచూస్తున్నారని వెల్లడించారు. రైతుల విషయంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయని ధ్వజమెత్తారు. 40 వేల కోట్ల రూపాయల రొయ్యలను మన దేశ రైతులు ఎగుమతి చేస్తే, అందులో సగం రాష్ట్ర రైతులే ఎగుమతి చేశారని తెలిపారు. రొయ్యల ధర పడిపోవడంతో 4 వేల కోట్ల రుపాయల నష్టం వాటిల్లిందని, దీనిపై మాత్రం ఎవరూ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ టీటీడీలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న రాజకీయాల వల్ల దేవుడి మీద నమ్మకం సన్నగిల్లే పరిస్థితి వచ్చింది. వ్యక్తి, పూజారి మీద కోపంతో దేవాలయాల మీద కక్ష కట్టొద్దని, వ్యవస్థ మీద బేషజాలకు పోకుండా వివాదం తొలగించాల’ని హితవు పలికారు. -
జిల్లాలకు ఎపీసీసీ పరిశీలకుల నియామకం
హైదరాబాద్: స్థానిక సంస్థలకు జరిగే ఉప ఎన్నికల్లో పరిశీలకులను నియమించడానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మార్చి 17న ఇందిరాభవన్‌లో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ ఎన్. రఘువీరారెడ్డి పార్టీ సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఉప ఎన్నికలకు సంబంధించిన విషయాలపై చర్చించారు. త్వరలో జరగనున్న మున్సిపల్/కార్పొరేషన్, వార్డుల ఉప ఎన్నికలకు పార్టీ పరిశీలకులుగా కొందరు నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు జిల్లాలు, వాటి పరిశీలకుల వివరాలను ఓ ప్రకటనలో ఏపీసీసీ వెల్లడించింది. జిల్లా పేరు పరిశీలకులు 1. విజయనగరం --- ద్రోణం రాజు శ్రీనివాస్(ఎపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే) 2. విశాఖపట్నం --- ఎస్.ఎన్.రాజా (ఎపీసీసీ ప్రధాన కార్యదర్శి) 3. తూర్పు గోదావరి --- పక్కాల సూరిబాబు (ఎపీసీసీ ప్రధాన కార్యదర్శి) 4. పశ్చిమ గోదావరి --- నరహరశెట్టి నరసింహారావు(ఎపీసీసీ ప్రధాన కార్యదర్శి) 5. కృష్ణా ---- సుందరరామ శర్మ (ఎపీసీసీ లీగల్ సెల్ చైర్మన్) 6. గుంటూరు ---- కె. బాపిరాజు (ఎపీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ) 7. నెల్లూరు ----- మస్తాన్‌వలీ (ఎపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే) 8. చిత్తూరు ------ డాక్టర్ సాకె శైలజానాధ్ (ఎపీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి) 9. కడప ----- షాజహన్ బాషా (ఎపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే) 10. కర్నూలు ----- డాక్టర్ ఎన్. తులసిరెడ్డి ( ఎపీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ) 11. అనంతపురం ------ అహ్మదుల్లా ( ఎపీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి) -
ఇందిరాభవన్‌లో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 67వ జయంతి వేడుకలు ఏఐసీసీ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ సమక్షంలో శుక్రవారం ఇందిరాభవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి తనకు ఎంతో ఆప్తుడని, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలతో పాటూ సోనియా గాంధీతో కూడా ఆయన ఎంతో సన్నిహితంగా ఉండేవారని దిగ్విజయ్ సింగ్ గుర్తు చేశారు. రాష్ట్రాభివృద్ధికి వైఎస్ఆర్ ఎంతగానో కృషి చేశారని దురదృష్టవశాత్తు హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించడం బాధాకరమన్నారు. సమైఖ్య రాష్ట్రంలో వేల మైళ్లు కాలినడకన ప్రయాణించి ప్రజల కష్టసుఖాలను తెలుసుకుని మేమున్నామంటూ అభివృద్ధి ఫలాలను ప్రవేశ పెట్టిన మహానేత వైఎస్ అని మాదాసు గంగాధరం కొనియాడారు. పాదయాత్రలో భాగంగా రాజమండ్రిలో అస్వస్థతకు గురయితే ఒక డాక్టర్ అయి ఉండి కూడా వెనుతిరగకుండా, మడమతిప్పకుండా అస్వస్థతతోనే తన పాదయాత్ర కొనసాగించారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ పాలన తర్వాత ప్రజలందరూ ఆయన పాలనే కావాలని కోరుకున్నారని గుర్తు చేశారు. ఏపీసీసీ ఉపాధ్యక్షులు డా.మాదాసు గంగాధరం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు తులసిరెడ్డి, సూర్యానాయక్, లీగల్ సెల్ ఛైర్మన్ సుందరరామ శర్మ, కిసాన్ సెల్ ఛైర్మన్ రవిచంద్రారెడ్డి, ఆర్టీఏ ఛైర్మన్ లక్ష్మినారాయణలతోపాటు ఇతర ఏపీసీసీ కాంగ్రెస్ నెతలు, తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసన మండలిలో విపక్షనేత షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్కలతో పాటూ టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, నాయకులు హాజరై వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. -
ఇందిరాభవన్ లో స్వాతంత్ర్య వేడుకలు
హైదరాబాద్ : నగరంలోని ఇందిరాభవన్‌లో 69వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఏపీసీసీ ఉపాధ్యక్షుడు మాదాసు గంగాధరం ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని ఆయన అన్నారు. ఈ వేడుకలలో కేవీపీ రామచందర్ రావు పాల్గొన్నారు. -
'అంబేద్కర్‌ను సొంతం చేసుకుంటేనే కాంగ్రెస్ కు భవిష్యత్'
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో వచ్చే నెలలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 150వ జయంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహిస్తుందని ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు తెలిపారు. ఆయన న్యూఢిల్లీలోని ఇందిరాభవన్‌లో ఏపీలోని అన్ని జిల్లాల కాంగ్రెస్ ఎస్సీ సెల్ సభ్యులతో చైర్మన్ శనివారం భేటీ అయ్యారు. అంబేద్కర్‌ను సొంతం చేసుకుంటేనే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుందని, అదే అజెండాతో పార్టీ దళిత విభాగాలు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అక్టోబర్‌లో విశాఖపట్నంలో జరిగే పార్టీ కార్యకర్తల సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పాల్గొంటారని కొప్పులరాజు నేతల భేటీలో వెల్లడించారు. -
పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి వైఎస్
సాక్షి, హైదరాబాద్: పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అని, ఆయన రాజకీయాలకతీతంగా 8 కోట్ల మందికి సంక్షేమ పథకాలందించి సీఎం ఎలా ఉండాలి.. ఎలా ఉండొచ్చు అని నిరూపించారని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన పీసీసీ నేతలు కొనియాడారు. వైఎస్ 66వ జయంతి సందర్భంగా బుధవారమిక్కడ ఇందిరాభవన్‌లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పీసీసీ నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. ఏపీ పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు తాగునీరు, సాగునీరు, ఇతర అభివృద్ధి పథకాలు, సాంకేతిక పరిజ్ఞానం అమలయ్యాయంటే అదంతా వైఎస్ చలవేనన్నారు. అభివృద్ధి ఫలాలు ప్రజలకందించడంలో ఆయన ఏ పార్టీ, ఏ కులం, ఏ మతం అనేది చూడలేదన్నారు. సంక్షేమ పథకాలు వైఎస్ చలవే: ఉత్తమ్ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఉభయ రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు ప్రస్తుతం సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే వైఎస్ చలవేనన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, వృద్ధాప్య, వికలాంగుల పింఛన్ తదితర పథకాలను సమర్థంగా అమలు చేశారని, బడుగు, బలహీనవర్గాల ఇబ్బందులు తెలిసిన వ్యక్తిగా వారికోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులిద్దరూ పథకాల పేర్లు మార్చి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని, అయినా అవి అసలైన లబ్ధిదారులకు అందట్లేదని చెప్పారు. ఏపీ శాసనమండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య మాట్లాడుతూ.. రాజశేఖరరెడ్డి లేనిలోటు పూడ్చలేనిదన్నారు. తెలంగాణ శాసనమండలిలో విపక్షనేత షబ్బీర్‌అలీ మాట్లాడుతూ ఎన్ని ఇబ్బందులెదురైనా ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించి 1.30 లక్షలమంది మైనార్టీలకు ఉన్నతవిద్యను అందజేసిన ఘనత ఆయనదేనని కొనియాడారు. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్కలు మాట్లాడుతూ.. వైఎస్ లేకపోయినా ఆయన ప్రవేశపెట్టిన పథకాలద్వారా తెలుగు ప్రజలు రోజూ గుర్తు చేసుకుంటుంటారన్నారు. కార్యక్రమంలో ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, ఎం.ఎ.ఖాన్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి సుధాకర్‌బాబు, మాజీ ఎంపీ తులసిరెడ్డి, రాష్ట్ర కిసాన్‌సెల్ చైర్మన్ రవిచంద్రారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జెట్టి కుసుమకుమార్, కార్యదర్శి లక్ష్మణ్ యాదవ్‌లతోపాటు కాంగ్రెస్ నేతలు, వైఎస్ అభిమానులు హాజరయ్యారు. -
ఇక్కడ లేని గొడవలు బాబు సృష్టిస్తున్నారు
-
ఇక్కడ లేని గొడవలు బాబు సృష్టిస్తున్నారు
శాంతిభద్రతలపై కేసీఆర్‌కు కృతజ్ఞతలు :సీఆర్ సాక్షి, హైదరాబాద్: ఏడాది కాలంగా హైదరాబాద్‌లో ఎలాంటి శాంతిభద్రత సమస్యా తలెత్తలేదని, ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కున్న కారణంగా ఏపీ సీఎం చంద్రబాబు రెండు రాష్ట్రాల మధ్య కొత్త సమస్యలు తెస్తున్నారని కాంగ్రెస్ నేత, శాసనమండలి విపక్ష నేత సీ రామచంద్రయ్య విమర్శించారు. హైదరాబాద్‌లో ప్రశాంత వాతావరణం ఉందని, అందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. ఓటుకు కోట్లు కేసులో కూరుకుపోయిన చంద్రబాబు రెండు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి ప్రజలను రెచ్చగొడుతూ గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇందిరాభవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పుడు సెక్షన్ 8 అమలు గురించి మాట్లాడటంలో ఉద్దేశం ఏమిటన్నారు. హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామంటూ సీఎం దిగజారి మాట్లాడుతున్నారన్నారు. -
హంద్రీ - నీవా ఘనత వైఎస్‌దే
సీఎం చంద్రబాబు విమర్శను తిప్పికొట్టిన శైలజానాథ్ సాక్షి, హైదరాబాద్: ‘హంద్రీ-నీవా’ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు కృష్జా జలాలు వచ్చాయంటే ఆ ఘనత దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని కాంగ్రెస్ మాజీ మంత్రి సాకే శైల జానాథ్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ద్రోహం చేసిందని సీఎం చంద్రబాబు విమర్శించడాన్ని ఆయన తప్పుపట్టారు. దీనిపై నిజా నిజాలను ప్రజల ముందుంచేం దుకు చంద్రబాబు తమతో బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. వేదిక, సమయం తెలుగుదేశం పార్టీ నాయకులే చెబితే అందుకు తాము సిద్ధమన్నారు. శనివారం ఇందిర భవన్లో శైలజానాథ్ మీడియాతో మాట్లాడారు. టీడీపీ హయాంలో పథకాన్ని తాగునీటికే పరిమితం చేసి 1996 మార్చి 11న ఒకసారి, 1999 జూలై 13న మరోసారి శంకుస్థాపన చేసి బాబు చేతులు దులుపుకుంటే, రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో ప్రాజెక్టును నిర్మించే విధంగా 2004 జూలై 24న (జీఓ ఎంంఎస్ నం: 731) ఉత్తర్వులు జారీ చేయడమే కాకుండా త్వరితగతిన పూర్తి చేశారని తెలిపారు. -
కాంగ్రెస్‌కు కాయకల్ప చికిత్స
నేడు పార్టీ నేతలు రఘువీర, బొత్స, కేవీపీ, సీఆర్సీ రాక కడప అగ్రికల్చర్ : రాష్ట్ర విభజన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారింది. దీంతో జిల్లాలో పార్టీ ఉనికి కష్టంగా మారింది. ఈ తరుణంలో పార్టీకి జవసత్వాలు నింపేందుకు కాయకల్ప చికిత్సకు పార్టీ రాష్ట్ర నేతలు పూనుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం నగరంలోని ఇందిరా భవన్లో జిల్లాలోని పార్టీ ప్రతినిధులతో, శాసనసభకు పోటీచేసి ఓడిపోయిన అభ్యర్థులతోనూ, రాష్ట్ర నేతలు ప్రతినిధులతో, మండల, నియోజకవర్గ స్థాయి నాయకులు, పార్టీ కార్యవర్గంతోనూ సమీక్ష నిర్వహించనున్నారు. ఆ తర్వాత విడివిడిగా నియోజకవర్గాల నాయకులను పార్టీ కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తల, ద్వితీయ శ్రేణి నాయకుల బాగోగులు చూడని రాష్ట్ర నేతలు ఇప్పుడు తగుదునమ్మా అంటూ సమీక్షలు చేయడం ఎంతవరకు సమంజసమని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీ తనను విస్మరించిందని అధ్యక్షుడు మాకం అశోక్ కుమార్ పార్టీని వీడి వైఎస్సార్ సీపీలో చేరారు. అలాగే ఎమ్మెల్సీ షేక్ హుస్సేన్ కూడా పార్టీ వీడారు. అదే విధంగా ఎమ్మెల్యేలు వీరశివ, వరద రాజులరెడ్డి, శివరామకృష్ణయ్య పార్టీని వీడి టీడీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే డీఎల్ రవీంద్రారెడ్డి, ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు పార్టీలో అంటీముట్టనట్లు ఉంటున్నారు. పార్టీలో ప్రముఖులుగా ఉన్న వారెవరూ లేకపోవడంతో పార్టీకి కళ తప్పింది. పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు రాష్ట్రనేతలు ఆపసోపాలు పడుతున్నారు. ఎన్నికల సమయంలో కార్పొరేటర్ అభ్యర్థులుగా పోటీచేసిన వారికి నయాపైసా కూడా ఇవ్వకపోవడంతో పోటీలో ఉన్న తాము పరువు పోతుందని పార్టీ కోసం వైదొలగకుండా పోటీచేసినందుకు అప్పులు మిగిలాయని కొందరు బాహటంగా విమర్శిస్తున్నారు. ఈ విషయాలన్నింటిని ఈ సమీక్షలో చర్చించి నేతలను నిలదీస్తామని యువజన కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు. -
చిరంజీవి కాంగ్రెస్‌ను వీడరు: రఘువీరా
సాక్షి, హైదరాబాద్/మడకశిర, న్యూస్‌లైన్: రాజ్యసభ సభ్యుడు, ఏపీ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ సారథి చిరంజీవి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి వెళ్తున్నట్టు వస్తున్న వార్తలను ఏపీపీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి తోసిపుచ్చారు. చిరంజీవి కాంగ్రెస్‌లోనే ఉంటారని స్పష్టం చేశారు. ఈ మేరకు అనంతపురం జిల్లా మడకశిరలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గెలుపోటములు ఏ పార్టీకైనా సాధారణమని, ఏపీ అభివృద్ధి విషయంలో వాచ్‌డాగ్‌లా వ్యవహరించడంతోపాటు ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని అన్నారు. టీడీపీ ప్రభుత్వం వెంటనే రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఖరీఫ్ వ్యవసాయం కుంటుపడే ప్రమాదముందన్నారు. మరోపక్క, చిరంజీవి పార్టీ మారుతున్నారనే వార్తలను ఏపీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి రుద్రరాజు పద్మరాజు కూడా ఖండించారు. ఈ మేరకు గురువారం ఆయన హైదరాబాద్‌లోని ఇందిరాభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. గవర్నర్ చొరవ చూపాలి.. రాష్ట్రంలో వరి రైతులను ఆదుకునేందుకు గవర్నర్ చొరవ చూపాలని పద్మరాజు కోరారు. అకాల వర్షాలతో వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని, వీరిని ఆదుకునేందుకు ప్రత్యేక వ్యవస్థను రూపొందించాల్సిన అవసరముందని అన్నారు. కాంగ్రెస్ హయాంలో సాధారణ రకానికి రూ.1,300, గ్రేడ్ ఏ రకానికి రూ.1,340 ఇచ్చిన విషయాన్ని పద్మరాజు గుర్తుచేశారు. వరి గిట్టుబాటు ధర సాధారణ రకానికి కనీసం రూ.1,310, ఏ గ్రేడ్‌కు రూ.1,340 ఇవ్వాలని సూచించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న చంద్రబాబు తన మేనిఫెస్టోలో ఫీజు రియింబర్స్‌మెంట్ అంశాన్ని పేర్కొనలేదని, ఫలితంగా విద్యార్థుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.